డిమాండ్ లేకపోవడంతో ఆగిన కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి: కేసుల పెరుగుదలతో రాష్ట్రాల వినతలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల కరోనా వ్యాక్సిన్లు కావాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్లకు అంతగా డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి సంస్థలు తయారీని తగ్గించాయి. ఇప్పటికే బూస్టర్ డోసులు కూడా చాలా మంది వేసుకున్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో అందుబాటులో లేవు.

కోవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. దేశంలో 105 ప్రైవేట్, ప్రభుత్వ సైట్లు టీకాలు వేసే డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. డిల్లీలో కేవలం ఆరు ప్రైవేట్ సైట్లు, ముంబైలో రెండు ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నిల్వ లేవని.. కోవాగ్జిన్ నిల్వలు కూడా మార్చి 31 వరకే నిండుకున్నాయని, దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. వ్యాక్సిన్ల కోసం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపారు.

covid vaccine

చెన్నైలోనూ ఒక కేంద్రం ద్వారానే టీకా పంపిణీ జరుగుతోంది. గిండిలో బయోలాజికల్ ఈకి చెందిన కార్బివాక్స్‌ని అందిస్తోంది. కోల్‌కతాలో కూడా వ్యాక్సిన్ల నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. మధ్యప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కరోనా డోసులు లేవు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, పంజాబ్, ఛండీగఢ్, హర్యానా, ఎన్సీఆర్ నగరాలైన నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో కూడా కరోనా వ్యాక్సిన్ల స్టాక్ లేదని ఆయా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గుర్గావ్‌లో కార్బెవాక్స్ మోతాదులతో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది. నోయిడాలోని భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ iNCOVACCని అందిస్తోంది. కాగా, ఇప్పటికే దేశంలో చాలా మంది బూస్టర్ డోసు కూడా తీసుకోవడంతో తక్కువ డిమాండ్ ఏర్పడింది. అయితే, తాజాగా, పెరుగుతున్న కరోనా కేసులతో మరోసారి వ్యాక్సిన్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.

covid vaccine

డిమాండ్ పెద్దగా లేకపోవడం, స్టాక్ కూడా ఉండటంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని గత సంవత్సరమే నిలిపివేశామని ఎస్ఐఐ సీఈఓ అదర్ పూనావాల్లా తెలిపారు. కోవావాక్స్ ఇప్పుడు సిద్ధంగా ఉందన్నారు. ఇది కరోనా నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు డిమాండ్ వస్తున్న క్రమంలో కోవిషీల్డ్ ఉత్పత్తిని కూడా చేస్తామని తెలిపరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+