కదులుతున్న ఆటోలో గ్యాంగ్ రేప్: పసికందును విసిరేసి.. వివాహితపై!
ఆటో ముందుకు సాగిన కొద్దిసేపటికే ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఇంతలో ఆమె ఒడిలో ఉన్న పాప ఏడుపు అందుకోవడంతో.. పసికందు అని కూడా చూడకుండా ఆటోలోంచి ఆ పసిగుడ్డును విసిరేశారు.
గుర్గావ్: భర్తతో గొడవపడి పుట్టింటికి బయలుదేరిన ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ వెంట ఉన్న 9ఏళ్ల పసికందును ఆటోలోంచి బయటకు విసిరేసి మరీ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. మే29 అర్థరాత్రి గుర్గావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మనేసర్ కు చెందిన 23ఏళ్ల వివాహిత గత నెల 29వ తేదీ రాత్రి భర్తతో గొడవపడింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపంతో పుట్టింటికి బయలుదేరింది. అప్పటికీ సమయం అర్థరాత్రి అవుతున్నా ఆమె లెక్క చేయలేదు.

రోడ్డు పైకి వచ్చి ఓ ఆటోలో ఎక్కింది. అప్పటికే అందులో మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆటో ముందుకు సాగిన కొద్దిసేపటికే ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఇంతలో ఆమె ఒడిలో ఉన్న పాప ఏడుపు అందుకోవడంతో.. పసికందు అని కూడా చూడకుండా ఆటోలోంచి ఆ పసిగుడ్డును విసిరేశారు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆటోలోంచి విసిరేయడంతో తీవ్ర గాయాలపాలైన పసికందు అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఢిల్లీ-గుర్గావ్ మధ్యలో ఉన్న పాత ఖండ్సా రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. ఘటనానంతరం మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వైద్య పరీక్షలకు మహిళ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications