దారుణం: మహిళా కండక్టర్‌పై దాడి, దుస్తులిప్పేశాడు

థానే: మహారాష్ట్రలోని ముంబై శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రభుత్వ బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళను బస్సు ఆపి, కిందికి దించిన ఓ ప్రయాణికుడు ఆమెపై దాడికి దిగాడు. అంతేగాక ఆమె దుస్తులిప్పేశాడు. థానే జిల్లాలోని కళ్యాన్ నుంచి పన్వేల్‌కు బుధవారం ఉదయం 8.30గంటలకు బస్సులో తొలి ట్రిప్పుకు బయల్దేరింది మహిళా కండక్టర్.

కాగా, విచారకర విషయం ఏమిటంటే మహిళా కండక్టర్‌పై దాడిచేసి, దుస్తులిప్పేస్తుండగా బస్సులోని ప్రయాణికులు చూస్తున్నారే తప్పా.. అతన్ని అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అయితే బస్సు నుంచి దిగిన కొందరు యువకులు అతన్ని వారించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు అభిషేక్ సింగ్(30)ను అరెస్ట్ చేశారు.

Woman Bus Conductor Beaten, Stripped by Male Passenger Near Mumbai

మహిళలకు కేటాయించిన డోర్ నుంచి బస్సు ఎక్కడంతో సరైన డోర్ నుంచి బస్సు ఎక్కాలని బస్సు డ్రైవర్ సింగ్‌ను కోరాడు. అయితే అది పట్టించుకోకుండా డ్రైవర్‌ను బూతులు తిట్టాడు. తండ్రి వయస్సులో ఉన్న డ్రైవర్‌ను ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించిన మహిళ కండక్టర్‌ను ఆమె కాళ్లు పట్టుకుని బస్సు నుంచి కిందికి లాగేశాడు.

ఆ తర్వాత ఆమెను చితకబాది, దుస్తులిప్పేసేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికులు ఇదంతా చూస్తున్నారే తప్పా ఎవరూ అడ్డుకునేందుకు ముందుకు రాలేదని మహిళా కండక్టర్ తెలిపింది. మరో బస్సులోని మహిళా కండక్టర్ ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా నిందితుడు దాడి చేశాడు. చివరకు ఆ బస్సులోని కొందరు యువకులు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+