రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్య

Woman commits suicide in Rashtrapati Bhavan premises
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని శుక్రవారం ఆమె మరణించింది. ఈ సంఘటన రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టించింది. సాజియా అనే 26 ఏల్ల మహిళ తన తండ్రికి కేటాయించిన పనివాళ్ల క్వార్టర్స్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె శవం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడాన్ని శుక్రవారం ఐదున్నర గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు చూశారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

ఆమె ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు. దాంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.

భర్తతో విడిపోయిన తర్వాత ఆమె తన తండ్రితో కలిసి ఉంటోందని ఓ పోలీసాఫీసర్ చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+