వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రియల్ హీరో: పట్టాలపై యువతి, రెప్పపాటులో కాపాడిన కానిస్టేబుల్, ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

ప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. ముంబైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి మృత్యువు అంచుల వరకు వెళ్లి..వచ్చింది. అయితే ఆమెను ఓ కానిస్టేబుల్ సాహసోపేతంగా కాపాడారు. అతను సేవ్ చేసే ఘటన సీసీ టీవీలో రికార్డయ్యింది. ఆ కానిస్టేబుల్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

ముంబై శాందుర్ట్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం ఘటన జరిగింది. ఓ 23 ఏళ్ల యువతి లోకల్ రైల్వే ట్రక్ వద్ద పడిపోయింది. కాసేపటి ట్రాక్‌పై రైలు వస్తోంది. అయితే ఆమెను చూసిన రైల్వే పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ శ్యామ్ సూరత్ కాపాడారు. క్షణాల్లో ఆమెను పట్టాలపై నుంచి తీశారు. అతనికి పక్కన ఉన్న వారు కూడా సాయం చేశారు. యువతిని ట్రాక్ నుంచి పైకి తీసుకొచ్చారు. దీంతో ప్రాణాప్రాయం తప్పింది. యువతిని శ్యామ్ కాపాడే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అక్కడున్న వారు శెభాష్ అంటూ ప్రశంసించగా.. మిగతా వారు కూడా కొనియాడారు.

Woman falls on Mumbai local railway track, saved by RPF constable..

రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నెంబర్ 2 వద్ద ఘటన జరిగింది. యువతి ఒక్కసారిగా పట్టాలపై పడిపోయింది. వెంటనే శ్యామ్ కాపాడారు. సిబ్బంది సమాచారంతో ఇతర రైలు కూడా మెల్లగా రావడం ప్రారంభించాయి. కానీ యువతిని మాత్రం కానిస్టేబుల్ కాపాడారు. అతని చొరవ, ధైర్య సాహసాలను ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. శభాష్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మిగతావారికి ఆదర్శంగా నిలిచారని కితాబిస్తున్నారు.

English summary
23-year-old woman's life was saved by a brave RPF constable just in time, after she fell on the track while the train was approaching
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X