మరో దారుణం: యువతిపై స్నేహితురాలి భర్తతోపాటు 11మంది గ్యాంగ్‌రేప్
మోగా: పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి తల్లికూతుళ్లను బయటికి తోసిన ఘటన మరువకముందే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కాగా, కూతురు మృతి చెందింది.
ప్రస్తుత ఘటనలో బాధిత యువతి బుధవారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలి భర్త, మరికొంత మంది కలిసి ఆమెను గ్రామ సమీపంలోని పొలాల్లోకి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడే ఓ గదిలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తన స్నేహితురాలి భర్త మరికొంత మందిని పిలిపించి తనపై అత్యాచారం చేయించాడని బాధిత యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తనతోపాటు వచ్చిన తన స్నేహితుడ్ని నిందితులు తీవ్రంగా కొట్టారని తెలిపింది. ప్రస్తుతం అతడు మోగ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలిపింది. తనపై 12 నుంచి 13మంది నిందితులు దాడి చేశారని బాధితురాలి స్నేహితుడు తెలిపాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు బాధితురాలి స్నేహితురాలు, ఆమె భర్త, మరో పది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు. కాగా, వైద్య పరీక్షల్లో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications