బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్
బరేలి: బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి మీద డ్రైవర్, కండెక్టర్ సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ లైంగిక దాడిలో (28) ఏళ్ల మహిళ తన 14 రోజుల పసికందును పోగొట్టుకుని ఆర్తనాదాలు చేస్తున్నది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాయ్ పూర్ కు చెందిన (28) ఏళ్ల బాలింత తన 14 రోజుల కుమారుడితో పాటు ఇద్దరు బిడ్డలతో కలిసి బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి ఓ ప్రయివేటు బస్సులో రాయ్ పూర్ కు బయలుదేరింది.
బస్సు స్టాప్ లో ప్రయాణికులు అందరూ దిగిపోయారు. ఆ మహిళ నిద్రమత్తులో అలాగే నిద్రపోయింది. బస్ స్టాప్ వచ్చిన విషయం గమనించలేకపోయింది. బస్సులో ఒంటరిగా మిగిలిపోయిన మహిళ మీద బస్సు డ్రైవర్, కండెక్టర్ కన్ను పడింది. బస్సును అక్కడి నుంచి తీసుకు వెళ్లారు.

నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి బాలింత మీద సామూహిక అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఆమె చేతిలో ఉన్న 14 రోజుల బిడ్డ కింద జారిపడి మరణించాడు. నిందితులు ఆమెను రోడ్డు మీద వదిలి పెట్టి బస్సుతో సహ అక్కడి నుంచి మాయం అయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించామని పోలీసులు అన్నారు. బస్సును గుర్తించామని, డ్రైవర్, కండెక్టర్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్బంగా ఇలాంటి సంఘటన జరగడం దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications