వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ రేప్ చేసి శరీరాన్ని రెండు ముక్కలు చేశారు

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: శ్రీమంతుల ఆగడాలకు ఒక దళిత మహిళ బలైపోయింది. మహిళపై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు అతి దారుణంగా శరీరాన్ని రెండు ముక్కలు చేశారు. తరువాత రెండు భాగాల మీద కిరోసిన్, లెదర్ సంచులు వేసి దారుణంగా నిప్పంటించి కాల్చేసిన సంఘటన ఆగ్రా శివార్లలో జరిగింది.

డీఐజీ లక్ష్మి సింగ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆగ్రా సమీపంలోని గ్వాలియర్ హైవే రహదారి దగ్గర మాల్పూరా గ్రామంలోని ఓం గార్డెన్ కాలనీలో హేమరాజ్, హేమా (40) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 12 సంవత్సరాల కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

హేమరాజ్, హేమా దళిత కులానికి చెందిన వారు. కొన్ని రోజుల క్రితం హేమరాజ్ కుమార్తె, కుమారుడిని పిలుచుకుని ఊరికి వెళ్లారు. హేమా ఒక్కటే ఇంటిలో ఉంటున్నది. అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన శ్రీమంతులు హేమ మీద కన్ను వేశారు.

శనివారం రాత్రి ఆమె ఇంటిలో చొరబడ్డారు. తరువాత హేమ మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత ఆదివారం ఆమె శరీరాన్ని రెండు ముక్కలు చేశారు. రెండు భాగాలు వేరు చేసి కిరోసిన్, లెదర్ సంచులు వేసి నిప్పంటించి కాల్చివేశారు.

Woman gang raped,torn to pieces in Agra

శరీరం అర్దం కాలిపోయింది. ఆదివారం రాత్రి హేమరాజ్ ఇంటికి వెళ్లాడు. ఇంటి బయట తాళం వేసిన విషయం గుర్తించాడు. తరువాత ఇంటి నుండి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించి గ్రామస్తుల సహాయంతో తలుపు పగలగొట్టి చూడగా విషయం వెలుగు చూసింది.

అయితే గ్రామ పెద్దలు హేమరాజ్ ను పిలిపించి రాజీ కావాలని, కేసు పెట్టరాదని బయపెట్టి ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలని బెదిరించారు. తరువాత హేమరాజ్ కుమార్తెను పిలుచుకుని గ్రామం నుండి వెళ్లి పోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ కు కేవలం 200 మీటర్ల దూరంలోనే హేమా హత్యకు గురైయ్యింది.

విషయం తెలుసుకున్న డీఐజీ లక్ష్మి సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శరీరంలోని అనేక భాగాలు అక్కడ గుర్తించారు. అర్దం కాలిపోయిన దుస్తులు హేమావి అని ఆమె భర్త గుర్తించాడు. సంఘటనా స్థలంలో మద్యం సీసాలు, 20కి పైగా నిరోద్ లు పడి ఉన్నాయని డీఐజీ లక్ష్మి సింగ్ చెప్పారు.

అదే గ్రామంలో నివాసం ఉంటున్న విక్రమ్ సింగ్, రాజేంద్ర సింగ్ ( ఓం గార్డెన్ కాలనీ యజమానులు), గ్రామ పెద్ద సుఖ్ పాల్ తో సహ 10 మంది హేమా మీద సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని విచారణలో వెలుగు చూసిందని డీఐజీ లక్ష్మి సింగ్ తెలిపారు.

English summary
a Dalit woman was gang-raped and murdered by local hoodlums allegedly associated with the family of a village headman in Malpura, Agra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X