మహిళపై గ్యాంగ్‌రేప్: కత్తితో పొడిచి రోడ్డుపై పడేశారు
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ఆమెను రోడ్డుపై పడేసి పరారయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సాగర్ పట్టణానికి చెందిన ఓ మహిళపై మత్తమందు చల్లి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆమెపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రోడ్డుపై పడేసి పరారయ్యారు. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా, తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో మృతి చెందింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇద్దరు కూతుళ్లకు నిప్పుపెట్టి మహిళ
ఓ మహిళ తన ఇద్దరు మైనర్ కూతుళ్లకు నిప్పుపెట్టి తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్తతో విభేదాల కారణంగానే నీతూ లోధి తన ఇద్దరు కూతుళ్లు సుహాన, నదానిలకు నిప్పుపెట్టి తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ముగ్గురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన తర్వాత నీతూ అత్తింటివారు పరారీ ఉన్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications