పోలీస్ స్టేషన్లో బీరు తాగి బూతులు తిట్టింది
ముంబై: పీకలదాక మద్యం సేవించిన యువతి పోలీస్ స్టేషన్ లో అధికారులు, సిబ్బందిని బూతులు తిట్టిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. న్యూసెన్స్ కేసులో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లిన పోలీసులకు ఆమె చుక్కలు చూపించింది.
అంతే పోలీసులు ఎందుకురా దేవుడా ఈమెను పిలుచుకుని వచ్చామని తలలు పట్టుకున్నారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈనెల 17వ తేదీన సునితా యాదవ్ (25) అనే యువతి పీకలదాక మద్యం సేవించి ఐటీసీ హోటల్ దగ్గర నానా హంగామా చేసింది.
అక్కడ ఉన్న వారిని పలు విధాలుగా ఇబ్బంది పెట్టింది. ఆ హంగామా అంతా అక్కడ ఎర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె వివరాలు సేకరించారు.

చివరికి సునితా యాదవ్ ను అంధేరి పోలీస్ స్టేషన్ లోకి తీసుకు వెళ్లారు. అయితే పోలీసు అధికారులు ముందే దర్జాగా కూర్చుని ఆమె అక్కడే బీరు సేవించింది. తరువాత నోటికి పని చెప్పి పోలీసులను అమ్మనా బూతులు తిట్టడం మొదలు పెట్టింది.
కిక్కు తలకెక్కడంతో ఒళ్లు మరిచిపోయింది. పోలీస్ స్టేషన్ లోనే మందు కొడుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెకు తగిన బుద్దిచెప్పారు. ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. రూ. 1,200 అపరాధ రుసుం చెల్లించిన సునితా యాదవ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications