నిద్రపోయే భర్తను చంపడానికి నాలుగు ప్లాన్‌లు వేసిన భార్య
కోయంబత్తూరు: నిద్రపోతున్న భర్తను చంపడానికి ఆమె విఫలయత్నం చేసింది. అతని ప్రాణాలు గట్టిగా ఉన్నట్లు ఉన్నాయి. పిల్లలు నిద్రలేచి కేకలు వెయ్యడంతో చుట్టు పక్కల ఉన్న వారు వచ్చి రక్షించి అతనిని ఆసుపత్రికి తరలించారు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుపూర్ లో కణ్ణన్, వంజియమ్మాళ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయని తెలిసింది.

గురువారం రాత్రి కణ్ణన్ గాడనిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో వంజియమ్మాళ్ నిద్రలేచి తాళ్లు తీసుకుని భర్త కాళ్లు, చేతులు కట్టి వేసింది. ముఖానికి పాలిథిన్ కవర్ చుట్టి ఊపిరిరాకుండా చేసింది. అంతే కాకుండా అంతకు ముందు తీసుకు వచ్చి పెట్టుకున్న పెద్ద కర్ర తీసుకుని భర్త మీద దాడి చేసింది.
కొడవలితో నరికింది. కత్తి తీసుకుని పోడిచింది. భార్య చంపేస్తుందని భయపడిన కణ్ణన్ కేకలు వేశాడు. ఇంటిలో నిద్రపోతున్న పిల్లలు నిద్రలేచి గట్టిగా కేకలు వేశారు. చుట్టు పక్కల వారు కేకలు విని అక్కడికి చేరుకున్నారు. తరువాత కణ్ణన్ ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు.
వంజియమ్మాళ్ నేరుగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. తన భర్త నిత్యం వేదింపులకు గురి చేస్తున్నాడని, ఆ బాధలు తట్టుకోలేక అతనిని చంపేయాలని అనుకున్నానని పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications