ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళకు ఐటీబీపీ జవాన్ లైంగిక వేధింపు

కాన్పూర్: అమ్రాపాలి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఐటీబీపీ జవాను ఒకరు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు శనివారం నాడు పోలీసులు తెలిపారు. వాల్తేరుగంజ్ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్‌కు చంఢీగఢ్‌లో పోస్టింగ్‌లో ఉన్నాడు.

అతను ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. అతను ఇంటికి వెళ్లేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను ప్రయాణిస్తున్న రైలు కాన్పూర్ చేరుకున్న సమయంలో ఓ మహిళ.. తనను పవన్ కుమార్ వేధింపులకు గురి చేశాడని జీఆర్పీ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది.

Woman molested by ITBP jawan

ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు అతను ఏమైనా తాగి ఉన్నాడా తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఐటీబీపీ సీనియర్ అధికారులకు సమాచారం అందించారు. అతనిని విచారిస్తున్నారు.

జపాన్ యువతిపై అత్యాచారం కేసులో ఐదుగురి అరెస్ట్

జపాన్ యువతిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన ఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు. ముగ్గురిని బోధగయ వద్ద, ఇద్దరిని కోల్‌కత్తాలో అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడిన ముఠా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందింది. ఈ ముఠా జపాన్ యాత్రికులను మోసం చేయడం, శారీరకంగా దాడికి పాల్పడడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైమ్) పికె ఘోష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+