రేప్‌ను అడ్డుకున్న వివాహితకు నిప్పు, మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యాచారాన్ని అడ్డుకున్న ఓ వివాహితపై నిందితుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
బోగినిపూర్ ప్రాంతంలోని పిప్రి గ్రామానికి చెందిన బాధితురాలు ఇంట్లో ఒంటిరిగా ఉన్న సమయంలో ఆమె భర్త స్నేహితుడు వచ్చాడు. ఆమెపై అత్యారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

బాధితురాలు కేకలు వేయడంలో విని చుట్టు పక్కల వారు మంటలు ఆర్పేసి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించింది.
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు దినేష్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications