యాకూబ్ మెమెన్ తీరని కోరిక: ముందే ఉరి
నాగపూర్: ముంబై పేలుళ్ల కేసు నిందితుడు యాకూబ్ మెమన్‌కు ఓ కోరిక తీరకుండానే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూనే రాజనీతిశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ పట్టాను అందుకోవడానికి ముందే జూలై 30న ఉరికొయ్య ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన మెమన్ జైలుశిక్ష అనుభవిస్తూనే 2010-12 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంంలో ఎంఏ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత 2014 వరకు రాజనీతి శాస్త్రంలో విద్యను అభ్యసించాడు.

అయితే భద్రతా కారణాల వల్ల ఎంఏ ఇంగ్లీష్ పట్టాను అందుకోవడానికి అనుమతి లభించకపోవడంతో 2013 ఆగస్టులో సర్టిఫికెట్‌ను ఆయనకు జైలులోనే అందజేశారు. రాజనీతి శాస్త్రంలో రెండో మాస్టర్ డిగ్రీని 2014 డిసెంబర్‌లో పూర్తి చేసినా పట్టాను ఇంకా అందుకోలేదు.
రాజనీతి శాస్త్రంలో ఎంఎ పట్టా తీసుకునేంత వరకు యాకూబ్ మెమెన్ జీవించే పరిస్థితి లేదు. ఆంగ్ల సాహిత్యంలోనూ రాజనీతి శాస్త్రంలోనూ మెమెన్ చాలా శ్రద్ధ చూపించాడని ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ శివ స్వరూప్ అంటున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వార్త వచ్చింది. యాకూబ్ మెమెన్ 1962 జులై 30వ తేదీన జన్మించాడు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications