Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Criminal Wife:ఐశ్వర్యకు టెక్కు ఎక్కవే, మామ, మొగుడి దెబ్బకు మైండ్ బ్లాక్, కోట్ల ఆస్తి కోసం పాడుపని !

చెన్నై/ కోయంబత్తూరు/ బెంగళూరు: ఆస్తి కోసం కన్నకొడుకును కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన ఐశ్వర్యకు హాలీవుడ్ సినిమా కనపడింది. మామ, మొగుడు బిగ్ షాట్స్ కావడంతో వారి దెబ్బకు ఐశ్వర్య దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యి కుయ్యోమొర్రో అంటూ లాయర్లను ఆశ్రయించింది. భర్తకు దూరంగా వేరుగా ఉంటున్న టెక్కులాడి ఐశ్వర్య అతని మీద రగిలిపోయింది. ఇప్పటికే రూ. 98 లక్షలు, జ్యువెలరీ షాపు భార్య సౌందర్యకు ఇచ్చేసి విడాకులు తీసుకున్న భర్త ఒంటరిగా జీవితం గడుపుతున్నాడు. అయితే భర్త దగ్గర ఉన్న కొడుకును కిడ్నాప్ చెయ్యడానికి సౌందర్య సూపర్ స్కెచ్ వేసింది. ఐశ్వర్య వెంట వెళ్లిన ముగ్గురు క్రిమినల్ చేతులు ఎత్తేయడంతో ఐశ్వర్య కిడ్నాప్ స్టోరీ రివర్స్ అయ్యింది.

 బిగ్ షాట్ వ్యాపారులు

బిగ్ షాట్ వ్యాపారులు

తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఎదయర్ పాళ్యంలోని తిడయలూర్ లో నాగ గణేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నాగ గణేష్ కోయంబత్తూరు సిటీ నుంచి తమిళనాడులోని అనేక జిల్లాలకు డ్రగ్స్ (మందులు, ఔషదాలు) హోల్ సేల్ డీలర్ గా, జ్యువెలరీ షాప్ ల యజమానిగా వ్యాపారం చేస్తూ విపరీతంగా డబ్బులు సంపాధిస్తున్నాడు.

పేరు ఐశ్వర్య.... ఐశ్వర్యవంతుల ఫ్యామిలి

పేరు ఐశ్వర్య.... ఐశ్వర్యవంతుల ఫ్యామిలి


కోయంబత్తూరులో జ్యువెలరీ షాపులు నిర్వహిస్తున్న తిళగరాజన్ కుమార్తె ఐశ్వర్యతో 2013లో నాగ గణేష్ వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత నాగ గణేష్, ఐశ్వర్య దంపతులు రెండు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో నాగ గణేష్, ఐశ్వర్య దంపతులకు రాజేంద్రన్ అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం రాజేంద్రన్ కు 7 సంవత్సరాలు. శ్రీమంతుల కుటుంబంలో జన్మించిన ఐశ్వర్యకు టెక్కు చాలా ఎక్కువే.

ముదిరిపోయిన పెళ్లాం పంచాయితి

ముదిరిపోయిన పెళ్లాం పంచాయితి


రానురాను భార్య ఐశ్వర్య ప్రవర్తనలో తేడా రావడంతో నాగ గణేష్ మండిపడ్డాడు. అసలే డబ్బులో పుట్టిపెరిగిన ఐశ్వర్య భర్త నాగ గణేష్ పెత్తనం సహించలేకపోయింది, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను అంటూ ఐశ్వర్య భర్త నాగ గణేష్ కు ఎదురుతిరిగింది. ఈ దెబ్బతో రానురాను ఇంట్లో నాగ గణేష్, ఐశ్వర్య దంపతుల మద్య గొడవలు ముదిరిపోయాయి. గొడవలు ముదిరిపోవడంతో 2016 నుంచి నాగ గణేష్, ఐశ్వర్య దంపతులు వేరువేరుగా ఉంటున్నారు. విడాకులు తీసుకోవాలని నాగ గణేష్, ఐశ్వర్య దంపతులు కోయంబత్తూరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతోంది.

లాయర్లు.... ఐశ్వర్య డీల్

లాయర్లు.... ఐశ్వర్య డీల్


2019లో దంపతులు విడిపోవడానికి ఓ డీల్ కుదిరింది. తనకు విడాకులు ఇస్తే ఐశ్వర్యకు రూ. 65 లక్షల నగదు, ఒక జ్యువెలరీ షాప్ ఇచ్చేస్తానని నాగ గణేష్ అంగీకరించాడు. రూ. 65 లక్షల నగదు, ఒక జ్యువెలరీ షాప్ తీసుకుని విడాకులు ఇవ్వడానికి ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐశ్వర్య, నాగ గణేష్ న్యాయవాదుల సమక్షంలో ఒప్పందం కుదిరింది. కొడుకు రాజేంద్రన్ తండ్రి నాగ గణేష్ దగ్గర ఉండటానికి ఐశ్వర్య అంగీకరించింది. 2016 నుంచి నాగ గణేష్ దగ్గర అతని కొడుకు రాజేంద్రన్ ఉంటున్నాడు. ఐశ్వర్య దగ్గరకు ఇంత వరకు చూడానికి కొడుకు రాజేంద్రన్ ఒక్కసారి కూడా వెళ్లలేదు.

క్రిమినల్స్+ఐశ్వర్య స్కెచ్

క్రిమినల్స్+ఐశ్వర్య స్కెచ్

కరోనా వైరస్ కారణంగా విడాకుల డీల్ పత్రాలు కోర్టులో సమర్పించడానికి ఆలస్యం అయ్యింది. కొడుకు రాజేంద్రన్ తన భర్త నాగ గణేష్ తో కలిసి ఉండటానికి ఐశ్వర్య న్యాయవాదుల సమక్షంలో లిఖితపూర్వకంగా అంగీకరించి పంపించింది. అయితే రూ. 89 లక్షలు, జ్యువెలరీ షాప్ ఇవ్వడంలో ఆలస్యం కావడంతో ఐశ్వర్య ముగ్గురు కిరాయి హంతకులు, క్రిమినల్స్ తో కలిసి భర్త నాగ గణేష్ దగ్గర పెరుగుతున్న కన్న కొడుకు రాజేంద్రన్ ను కిడ్నాప్ చెయ్యడానికి స్కెచ్ వేసింది.

మొగుడి ఇంట్లో రచ్చరచ్చ

మొగుడి ఇంట్లో రచ్చరచ్చ

ఐశ్వర్య స్కెచ్ ప్రకారం పట్టపగలు కోయంబత్తూరులోని ఎదయర్ పాళ్యంలోని తుడియలూర్ నగర్ లోని భర్త నాగగణేష్ ఇంటి దగ్గరకు ఐశ్వర్య, ముగ్గురు క్రిమినల్స్ కారులో వెళ్లారు. కారులో కుర్చున్న ఐశ్వర్య లోపలికి వెళ్లి తన కొడుకు రాజేంద్రన్ ను కిడ్నాప్ చేసి తీసుకురావాలని క్రిమినల్స్ కు సూచించింది. ఓ క్రిమినల్ గేట్ బయట కాపాల ఉండగా క్రిమినల్స్ ఇంట్లోకి వెళ్లి నాగ గణేష్ తల్లి మీద దాడి చేసి ఆమె మనుమడు రాజేంద్రన్ ను కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించారు.

దెబ్బకు ఐశ్వర్యకు హాలీవుడ్ సినిమా

దెబ్బకు ఐశ్వర్యకు హాలీవుడ్ సినిమా

ఇంట్లోనే ఉన్న నాగ గణేష్ కేకలు వేసి కొడుకు రాజేంద్రన్ రక్షించి బెడ్ రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సందర్బంలో చిక్కిపోతామని భయపడిన క్రిమినల్స్ నేరుగా కారు దగ్గరకు పరుగు తీశారు. ఆ సమయంలో నాగ గణేష్ మొబైల్ తీసుకుని ఇంటి బయటకు వచ్చి కారులో కుర్చున్న భార్య ఐశ్వర్య ఫోటోలు తియ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులు వస్తే చిక్కిపోతామని భయపడిన భార్య ఐశ్వర్య తన వెంట వచ్చిన క్రిమినల్స్ తో కలిసి కారులో పరారైయ్యింది. కేసు నమోదు చేసిన కోయంబత్తూరు వెస్ట్ పోలీసులు క్రిమినల్స్ తో కలిసి కొడుకును కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన ఐశ్వర్య మీద కేసు పెట్టాకె. పట్టపగలు ఐశ్వర్య కొడుకునే కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించడం కోయంబత్తూరులో కలకలం రేపింది. కేసు నుంచి తప్పించుకోవడానికి ఐశ్వర్య లాయర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+