యూపీలో యోగీ 2.0కు ఏడాది పూర్తి-అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు-25న భారీ వేడుకలకు ప్లాన్
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నెలలో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు యోగీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కమిటీల ఏర్పాటుతో పాటు భారీగా నిధులు వెచ్చించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంతో పాటు ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం ఆదిత్యనాథ్‌ను హైలైట్ చేయడానికి యుపి ప్రభుత్వం మరియు బిజెపి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం గతేడాది 255 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 మార్చి 25న వరుసగా రెండోసారి సీఎంగా ఆదిత్యనాథ్ ప్రమాణం చేశారు.

ఈ శనివారం యోగీ ప్రభుత్వంలోని మంత్రులు, బీజేపీ ఆఫీస్ బేరర్లతో కలిసి రాష్ట్ర, జిల్లా స్థాయిలో గత ఆరేళ్లలో సాధించిన విజయాలను ప్రకటిస్తారు. మరోవైపు ఈ ఏడాది మార్చి 1న ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కాలం పనిచేసిన (5 ఏళ్ల 346 రోజులు) సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. ఆదిత్యనాథ్ కంటే ముందు కాంగ్రెస్‌కు చెందిన సంపూర్ణానంద్ 1954 నుండి 1960 వరకు అత్యధిక కాలం (5 సంవత్సరాల 345 రోజులు) యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మార్చి 25 నాటికి, ఆదిత్యనాథ్ ఆరేళ్ల ఆరు రోజుల పదవీకాలం పూర్తి చేస్తారు. దీంతో ఈ రెండు వేడుకలు కలిపి ఘనంగా నిర్వహించేందుకు యోగీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.












Click it and Unblock the Notifications