Yogi Adityanath : యూపీలో భారీ ఎత్తున నవరాత్రి పండుగ-యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఆదేశాలు..

యూపీలో ఈ ఏడాది భారీ ఎత్తున చైత్ర నవరాత్రి, రామనవమి పండుగలు నిర్వహించాలని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పండుగల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా మెజిస్ట్రేట్ లకు ప్రత్యేక సర్కులర్ పంపింది. ఇందులో పండుగ సందర్భంగా ఏ ఆలయంలో ఏయే కార్యక్రమాలు చేయాలన్న దాన్ని సూచించింది.

చైత్ర నవరాత్రి మరియు రామ నవమి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దుర్గా దేవత ఆలయాలు, శక్తిపీఠాలలో మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌లకు ఆదేశాలను జారీ చేసింది.రాష్ట్ర సాంస్కృతిక శాఖ అన్ని డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లకు నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరాలు పంపింది. మార్చి 21లోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎంపిక చేసిన దేవాలయాల జిపిఎస్ స్థానాలు, చిరునామాలు, ఫోటోగ్రాఫ్‌లు, ఆలయ నిర్వహణ సంస్థల సంప్రదింపు వివరాలను షేర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంలో వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో ఇద్దరు నోడల్ అధికారులను కూడా నియమించారు.

yogi adityanath government orders grand celebration of chaitra navratri and ram navami

చైత్ర నవరాత్రి సమయంలో దుర్గా దేవి తొమ్మిది అవతారాలను భక్తులు పూజిస్తారు. దేవాలయాలు, శక్తిపీఠాలలో దుర్గా షప్తశతి, దేవి గానం, దేవి జాగరణలు నిర్వహించాలని, దాని ప్రకారం ఈ కార్యక్రమాల్లో మహిళలు, బాలికల భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిర్వహించాల్సిన ఈవెంట్‌ల వివరాలు, ఫోటోగ్రాఫ్‌లు సాంస్కృతిక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+