వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: ఐసోలేషన్‌లో యోగి ఆదిత్యనాథ్ -యూపీలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కాసేపటికే...

|
Google Oneindia TeluguNews

భారత్ లో కొవిడ్ మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గత రికార్డులను చెరిపేస్తూ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఏకంగా సీఎంవోలోనే వైరస్ వ్యాప్తి చెంది, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

భారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివేభారత్‌లో విలయం: Sputnik V రాకతో భరోసా? -రష్యన్ వ్యాక్సిన్ ధర, సమర్థత ఎంత? -కీలక అంశాలివే

''నా ఆఫీసులో కొందరు అధికారులకు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వాళ్లలో కొందరు నాతో సన్నిహితంగా మెలిగారు. దీంతో వైద్యుల సూచన మేరకు నేను కూడా ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇకపై నా పనిని వర్చువల్ విధానంలోకొనసాగిస్తాను'' అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. నిజానికి..

Yogi Adityanath In Isolation After Officers covid-19 positive, No lockdown, says up cm

యూపీలో కొవిడ్ కేసుల ఉధృతి పీక్స్ కు చేరింది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా18,021 కేసులు, 85 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,23,582కు, మొత్తం మరణాలు 9,309కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,980గా ఉంది. అత్యధిక జనాభా, కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా వెళుతున్నా...

video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్‌తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్video leak: జగన్, దొంగ సాక్షి విష పన్నాగం -నారా లోకేశ్‌తో విడదీయలేరు: టీడీపీ అచ్చెన్నాయుడు రియాక్షన్

కరోనా వైరస్ కట్టడి కోసం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించబోతున్నారనే వార్తలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భిన్నంగా స్పందించారు. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, యూపీలో మాత్రం లాక్ డౌన్ విధించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటామని, టెస్టుల సంఖ్యను పెంచాల్సి వస్తే ప్రైవేట్ లాబ్స్ సేవలను వాడుకుంటామని, ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని, కొవిడ్ కేసుల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల సేవలను కూడా వాడుకుంటామని సీఎం తెలిపారు. యూపీలో లాక్ డౌన్ ఉండబోదని క్లారిటీ ఇచ్చిన కొద్దిసేపటికే తాను ఐసోలేషన్ లోకి వెళుతున్నట్లు సీఎం యోగి ప్రకటించారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath has gone under isolation after some officials of his office tested positive for the coronavirus. "Some officers of my office have tested positive for the coronavirus. Some of them were in contact with me. Hence, as a precaution, I have isolated myself and starting my work virtually," he tweeted in Hindi. earlier cm said that up government would neither impose a lockdown nor let the people die in misery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X