యూపీలో శాంతియుతంగా రంజాన్ పండుగ-మత ఘర్షణలు లేవన్నయోగీ ఆదిత్యనాథ్..

ఉత్తర్ ప్రదేశ్ లో రంజాన్ పండుగ ఎలా జరిగిందన్న దానిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో మత సామరస్యం లేదని, పండుగల సమయంలో మత ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న వాదన నేపథ్యంలో యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగల సమయంలో ఈ మతఘర్షణలు జరుగుతాయన్న విమర్శలపై యోగీ స్పందించారు.

రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు లేవని శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా యోగీ ఈ ప్రకటన చేశారు. ఈద్ సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు లేవన్నారు. ఎవరి రాకపోకలకు ఇబ్బంది లేదన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని యోగీ వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఇది చట్టం అందరినీ సమానంగా చూస్తుందనే వాదనకు బలం చేకూరుస్తుందన్నారు.

yogi adityanath reaction on how ramzan festival concluded in UP

గతంలో అజంగఢ్‌ వంటి జిల్లాలంటే భయపడేవారని, కానీ నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రస్తుతం అజంగఢ్‌ నగరం ఎక్స్‌ప్రెస్‌వే హైవేతో అనుసంధానమైందని జిల్లాలో విమానాశ్రయం, యూనివర్సిటీ కూడా రాబోతున్నాయని సీఎం యోగీ పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిస్ధితిని సమర్ధించుకున్న యోగీ ఆదిత్యనాథ్.. భయం, అరాచకం లేదన్నారు. విధ్వంసం నేడు వేడుకలుగా మారిన వేళ.. ఇలాంటి పాలన ప్రజల విశ్వాసానికి ప్రతీకగా మారుతుందన్నారు.

అంతకు ముందు సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మత సామరస్యంపై, ముస్లింలపై జరుగుతున్న దాడులపై విమర్శలు ఎదురవుతున్న వేళ.. ఈ ఏడాది రంజాన్ వేడుకల నిర్వహణ విషయంలో యోగీ సర్కార్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రార్ధనలు ప్రశాంతంగా సాగాయని ఆయనే స్వయంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+