పరువు హత్యలు: రివాల్వర్ తో కాల్చి ప్రేమజంట హత్య
భోపాల్: ప్రేమ జంటను చూసి జీర్ణించుకోలేని వ్యక్తులు ఇద్దరిని అతి దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఇది పరువు హత్యల కేసు అయి ఉంటుందని టీకమ్ గడ్ జిల్లా అదనపు ఎస్పీ సునీల్ తివారీ అంటున్నారు.
మధ్యప్రదేశ్ లోని తికమ్ గడ్ గ్రామంలో బడి రాజ, భాన్ సింగ్ అనే యువ జంట నివాసం ఉంటున్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని సమాచారం. ఇద్దరి కులాలు వేరు. గత కొన్ని నెలల నుండి గ్రామంలో వీరిద్దరి గురించి ఒకటే చర్చ జరిగింది.

గురువారం గ్రామం సమీపంలో బడిరాజ, భాన్ సింగ్ లను తుపాకితో కాల్చి హత్య చేశారు. విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జిల్లా అదనపు ఎస్పీ సునీల్ తివారీ మాట్లాడుతూ - యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారని, ఇది ఓర్వలేక రివాల్వర్ తో కాల్చి హత్య చేసి ఉంటారని, పోస్టుమార్టుం నివేదిక వచ్చిన తరువాత అన్ని విషయాలు వెలుగు చూస్తాయని వివరించారు.












Click it and Unblock the Notifications