FASTag: జనవరి 31 తర్వాత మీ ఫాస్టాగ్ డీయాక్టివేట్ లేదా బ్లాక్..! ఇలా చేయకపోతే..!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై కొన్నేళ్లుగా ఫాస్టాగ్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. ఫాస్టాగ్ లేకుండా ఏ ఒక్క వాహనం కూడా టోల్ గేట్ దాటే పరిస్దితి లేదు. కేవలం కొన్ని మినహాయింపు ఇచ్చిన వర్గాలకు తప్ప మిగతా వాహనదారులంతా ఫాస్టాగ్ కు రీఛార్జ్ చేయించుకని రహదారులపై ప్రయాణించాల్సిందే. టోల్ గేట్లు దాటాల్సిందే. లేకపోతే టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు తప్పవు. అయితే ఈ ఫాస్టాగ్ వాడకం విషయంలో ఇప్పటికే పలు నిబంధనలు తెస్తున్న NHAI ఇప్పుడు మరో రూల్ పెట్టింది.

దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వాడుతున్న వాహనదారులు ఈ నెలాఖరు లోపు వాటికి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఫాస్టాగ్ డీయాక్టివేట్ కావడం లేదా బ్లాక్ కావడం జరుగుతుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ హెచ్చరించింది. ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరణ చేసే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 your FASTag may not work after jan 31 if kyc is not done- here are details

ఫాస్టాగ్ వాడుతున్న వారు అందులో బ్యాలెన్స్ కలిగి ఉన్నా లేకున్నా కేవైసీ మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ ఉంది కాబట్టి కేవైసీ చేయించుకోకపోయినా అది డీయాక్టివేట్ కాదనే ధీమా వద్దని కేంద్రం చెబుతోంది. బ్యాలెన్స్ తో సంబంధం లేకుండా కేవైసీ లేకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా సదరు ఫాస్టాగ్ లను బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని NHAI ఇవాళ క్లారిటీ ఇచ్చింది. దీంతో వాహనదారులు ఇప్పుడు కేవైసీ కోసం బ్యాంకుల్ను సంప్రదించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే కేవైసీ ఉన్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+