కాశ్మీర్ కోసమే రాళ్లు రువ్వుతున్నారు: ఫరూక్ అబ్దుల్లా

కాశ్మీర్ యువత దేశం కోసమే భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతోందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

శ్రీనగర్: కాశ్మీర్ యువత దేశం కోసమే భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వుతోందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

మతం పేరుతో విభజించాలనుకుంటున్నవారి పైనే తమ పోరాటం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను ఓ విషయం చెప్పదలుచుకున్నానని, టూరిజం మా జీవితం అని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.

Youth pelting stones sacrificing lives for Kashmir, not tourism: Farooq Abdullah

అలాగే, రాళ్లు విసరడం వల్ల టూరిజానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. వారు దేశం కోసం రాళ్లు విసురుతున్నారన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారత్-పాక్‌లు తమ సమస్యలను పరిష్కరించుకోలేవని, ఈ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరమని, ఆ దేశం ముందుకు రావాలన్నారు.

కాగా, ఇటీవల అతిపెద్ద టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ కాశ్మీర్ యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాశ్మీర్ యువతకు ఓ వైపు తీవ్రవాదం, మరోవైపు పర్యాటక రంగం అందుబాటులో ఉన్నాయని, రెండింటిలో పర్యాటకాన్ని ఎంచుకోవాలని హితవు పలికారు. దీనికి ఫరూక్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+