భారత్- పాక్ బెహన్.. బెహన్: నిండా ముంచింది

YouTuber Jyoti Malhotra: పాకిస్తాన్ కు గూఢచర్యం చేశారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన 33 సంవత్సరాల ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి అరెస్ట్ అయ్యారు. ఈ సాయంత్రం పోలీసులు ఆమెను హిసార్‌లోని న్యూ అగర్సేన్ ఎక్స్‌టెన్షన్ లో అదుపులోకి తీసుకున్నారు.

భారత ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. దేశ సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించారనే కారణంతో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

YouTuber Jyoti Malhotra has been arrested on the charges of spying for Pakistan

జ్యోతి మల్హోత్రకు పాకిస్తాన్ హైకమిషన్ అధికారి ఎహసాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ తో మంచి పరిచయాలు ఉన్నాయని హర్యానా పోలీసులు చెబుతున్నారు. ఆమె పాకిస్తాన్ వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని విచారణలో తేలింది. రెండుసార్లు పాకిస్తాన్ కు సైతం వెళ్లొచ్చినట్లు సమాచారం.

తొలిసారి పాకిస్తాన్ ను సందర్శించినప్పుడు రహీం అలియాస్ అలీ అహ్వాన్‌ను కలిశారని, బస, ఇతర ప్రయాణ సౌకర్యాల ఏర్పాట్లు చేశాడని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఈ విషయాన్ని జ్యోతి మల్హోత్ర సైతం అంగీకరించారని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ యూట్యూబర్ అలీ అహ్వాన్.. తనను షకీర్, రాణా షాబాజ్‌లకు పరిచయం చేశాడని జ్యోతి వెల్లడించింది.

పాకిస్తాన్ భద్రత, ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ అధికారులతో అలీ అహ్వాన్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాడని, దానికి తనతో పాటు షకీర్ రాణా షాబాజ్‌లను తీసుకెళ్లాడని వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి షకీర్ మొబైల్ నంబర్‌ను తీసుకొని జాఠ్ రంధావా పేరుతో సేవ్ చేసుకున్నట్లు చెప్పారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

భారత్ కు తిరిగి వచ్చిన తరువాత వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్ ద్వారా అలీ అహ్వాన్‌, షకీర్, రాణా షాబాజ్‌తో నిరంతరం టచ్‌లో ఉండేవాళ్లని, దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వాళ్లకు అందించానని జ్యోతి మల్హోత్రా తమ విచారణ సందర్భంగా అంగీకరించినట్లు పోలీసులు వివరించారు.

అరెస్ట్ అనంతరం ఆమెను పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. అయిదు రోజుల పాటు కస్టడీకి తరలిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కస్టడీ సందర్భంగా మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని హిసార్ పోలీసులు వెల్లడించారు. యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేసిన అంశాలపైనా నిఘా వేశామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+