వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: లండన్ నైట్ క్లబ్ లో యాసిడ్ దాడి, 12 మందికి గాయాలు

బ్రిటన్ రాజధాని లండన్ ప్రజలు యాసిడ్ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున కిక్కిరిసిన ఓ నైట్ క్లబ్ లో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడి జరిగింది.ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ ప్రజలు యాసిడ్ దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున కిక్కిరిసిన ఓ నైట్ క్లబ్ లో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన యాసిడ్ దాడి జరిగింది.ఈ దాడిలో 12 మంది గాయపడ్డారు.

బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎవరీకీ ప్రాణాపాయం సంభవించలేదన్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులకు సంబంధం ఉందని భావించడం లేదని పోలీసులు తెలిపారు.

దాడి జరిగిన సమయంలో నైట్ క్లబ్ లో దాదాపు 600 మంది ఉన్నారు. నైట్ క్లబ్ లో ఉన్నవారిపై గుర్తు తెలియని ప్రమాదకర పదార్థాన్ని చల్లారని లండన్ ఫైర్ బ్రిగేడ్ ప్రతినిధి చెప్పారు. పరీక్షలో ఇది ఓ ఆమ్ల పదార్థంగా తేలిందన్నారు.

12 Injured In Acid Attack Inside Packed London Club

ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులకు సమాచారం రావడంతో వారు ఘటన స్థలానికి వెళ్ళి క్లబ్ కు వెళ్ళే అన్ని దారులను మూసివేయించి విచారణ చేపట్టారు.

అయితే ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.2010 తర్వాత లండన్ లో యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. దాదాపుగా 1800 కేసులు నమోదయ్యాయి. కొన్ని క్రిమినల్ గ్యాంగులు ఈ దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే లండన్ లో జరిగిన యాసిడ్ దాడిలో భార్య, భర్తలు, వారి మూడేళ్ళ కొడుకు గాయపడ్డారు.

English summary
Twelve people were injured when a corrosive substance was sprayed inside a packed London nightclub, police and fire services said, amid a sharp rise in acid attacks in Britain's capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X