హెచ్చరికలు బేఖాతరు: అమెరికాకు షాకిచ్చిన భారత్ సహా 128 దేశాలు
న్యూయార్క్: జెరూసలేం విషయంలో అమెరికాకు ఐక్యరాజ్య సమితిలో చుక్కెదురైంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకోవాలని పేర్కొంటూ చేసిన తీర్మానానికి భారీ మద్దతు లభించింది.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గురువారం ఈ తీర్మానానికి అనుకూలంగా భారత్ సహా 128 దేశాలు ఓటు వేశాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలకు అమెరికా ఆర్థిక సహాయంలో కోత పెడతామని ట్రంప్ హెచ్చరించారు.

అయినప్పటికీ ఆ బెదిరింపులను పట్టించుకోలేదు ఈ 128 దేశాలు. ట్రంప్ హెచ్చరికల ప్రభావం స్వల్పంగా మాత్రమే కనిపించింది. కేవలం 9 దేశాలు మాత్రమే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
అయితే అమెరికాకు మిత్ర దేశాల్లో కొన్ని పాశ్చాత్య, అరబ్ దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. 35 దేశాలు ఓటింగ్ నుంచి గైర్హాజరయ్యాయి.












Click it and Unblock the Notifications