ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీకొనడంతో 15 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందగా.. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. కిషోర్‌గంజ్‌లోని బైరబ్ వద్ద సోమవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

15 Killed, over 100 injured After 2 Trains Collide In Bangladeshs Dhaka

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరబ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారి సిరాజుల్ ఇస్లాం వెల్లడించారు.కాగా, రైలు కింద పలువురు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రైలు బోగీల కింద పడివున్న వారిని వెలికి తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక, ఇతర సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. గాయపడినవారిని స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

15 Killed, over 100 injured After 2 Trains Collide In Bangladeshs Dhaka

'ప్రాథమిక నివేదిక ప్రకారం.. సరుకు రవాణా రైలు వెనుక నుంచి ఎగరో సింధూర్‌ను ఢీకొట్టింది. రెండు క్యారేజీలను ఢీకొట్టింది' అని ఢాకా రైల్వే పోలీసు సూపరింటెండెంట్ అనోవర్ హొస్సేన్ తన నివేదికలో తెలిపారు.

కాగా, బంగ్లాదేశ్‌లో తరచూ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సరిగాలేని సిగ్నలింగ్ వ్యవస్థ, నిర్లక్ష్యం, కాలం చెల్లిన పట్టాలను వినియోగిస్తుండటం.. మౌలిక సదుపాయాల లేమీ.. ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+