అమెరికాలో 'ది బెస్ట్' జాబ్స్ ఇవే: ఆ 25ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్!..

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: కెరీర్ వెబ్‌సైట్ గ్లాస్ డోర్ ఇంక్ అనే సంస్థ అమెరికాలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు టెక్కీలు, హెల్త్ కేర్ రంగాల్లో పనిచేస్తున్నవారికి సంస్థలు అత్యధిక వేతనాలు ముట్టజెప్పుతున్నట్లుగా వెల్లడైంది. ఇక అత్యధిక మూల వేతనంలో ఫిజిషియన్స్ ముందు స్థానంలో ఉన్నారు.

ఫిజిషియన్స్ లక్షా 86వేల డాలర్ల దాకా సంపాదిస్తున్నట్లు గ్లాస్ డోర్ ఇంక్ తెలిపింది. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.1,22,29,882 వరకు ఉండవచ్చు. ఫిజిషియన్ల తర్వాత అత్యధిక వేతనం అందుకుంటున్నవారి జాబితాలో ఫార్మసీ మేనేజర్లు ఉన్నారు. అయితే ఫార్మాసూటికల్ డిగ్రీతో పాటు మేనేజ్ మెంట్ అనుభవముంటే వీరికి వేతనాలు మరింత బాగుంటాయని పేర్కొంది.

25 Highest Paying Jobs in America for 2017

పేటెంట్ అటార్నీలు సైతం అత్యధిక వేతనం అందుకుంటున్నట్లుగా తెలిసింది. కాగా, గ్లాస్ డోర్ ఇంక్ మొత్తం 25బెస్ట్ జాబ్స్ తో జాబితా రూపొందించగా.. అందులో 11టెక్ పరిశ్రమలే ఉండటం విశేషం. సిలికాన్ వ్యాలీ ఉద్యోగుల వేతనాలు బాగుంటాయని, నగదుతో పాటు స్టాక్ బోనస్ లు వీరికి అందుతుంటాయని తెలిపింది.

జాబితాలోని 25బెస్ట్ పేయింగ్ జాబ్స్:

ఫిజిషియన్, ఫార్మసీ మేనేజర్, పేటెంట్ అటార్నీ, మెడికల్ సైన్స్, లియాసన్, ఫార్మసిస్ట్, ఎంటర్ ప్రైజ్ అర్కిటెక్, ఫిజిషియన్ అసిస్టెంట్, యాప్ డెవలప్ మెంట్ మేనేజర్, ఆర్ అండ్ డీ మేనేజర్, కార్పోరేట్ కంట్రోలర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Physician claims the top spot, followed by Pharmacy Manager and Patent Attorney. New jobs to this year’s list include Nurse Practitioner (#14) and Nuclear Engineer (#24)
Please Wait while comments are loading...