తుపాకీతో చర్చి లోపలకు దూసుకొచ్చి, టెక్సాస్‌లో కాల్పులు: 27 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu
  Texas Church Incident : At least 26 People Lost Life, VIDEO

  టెక్సాస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆదివారం టెక్సాస్‌లోని బాప్టిస్ట్ చర్చిలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 మంది వరకు మృతి చెందారు.

  సుదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో ఉదయం పదకొండున్నర గంటల సమయంలో సుమారు 50 మంది ప్రార్థనల్లో ఉండగా ఆగంతుకుడు గన్‌తో లోపలికి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

  26 dead in Texas Church mass shooting

  ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారి, ఆరేళ్ల బాలుడు సహా 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఆగంతుకుడు సైనిక దుస్తుల్లో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

  కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. కాల్పులు పూర్తిగా ఆగిపోయినట్లు చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న మహిళ తల్లి ఒకరు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. తాను జపాన్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  At least 26 people were killed in yet another incident of mass shooting reported in the United States. A gun man went into a Baptist Church in Texas and shot dead dozens of people during the Sunday morning services.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి