వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాపకింద నీరులా ఉగ్రవాదం: షాపింగ్ మాల్‌లో యథేచ్ఛగా కాల్పులు

|
Google Oneindia TeluguNews

కోపెన్‌హెగన్: మొన్నటివరకు అగ్రరాజ్యం అమెరికాకే పరిమితమైన గన్ కల్చర్.. ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందినట్టే కనిపిస్తోంది. తరచూ అమెరికాలో సంభవించే కాల్పుల ఉదంతాలు ఆ దేశ సరిహద్దులను దాటాయి. యూరప్ దేశాల్లో అడుగు పెట్టాయి. తాజాగా డెన్మార్క్‌లో చోటు చేసుకున్న కాల్పులు.. ఆ దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రాథమికంగా నిర్ధారించింది.

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఓ దుండగుడు యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మారణాయుద్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు.

3 killed in Denmarks Copenhagen mass shooting, police not ruled out an act of terrorism

లార్జ్ ఫీల్డ్స్ షాపింగ్ మాల్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిటీ సెంటర్-కోపెన్‌హెగన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న కస్ట్రూప్‌ మధ్యలో ఉంటుందీ షాపింగ్ మాల్. ఆదివారం సందర్శకులకు క్రిక్కిరిసిపోయివున్న సమయంలో 22 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ యువకుడు డబుల్ బ్యారెల్ గన్‌తో మాల్‌లోకి ప్రవేశించారు. యథేచ్ఛగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి బుల్లెట్ గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతణ్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని డెన్మార్క్ పౌరుడిగా నిర్ధారించినట్లు కోపెన్‌హెగన్ పోలీస్ చీఫ్ సొరెన్ థొమాస్సెన్ చెప్పారు. అతని పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. ప్రాథమిక దర్యాప్తు ముగిసిన తరువాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నామని థొమాస్సెన్ చెప్పారు.

ఈ ఘటన తరువాత నగరం మొత్తం హైఅలర్ట్‌ను ప్రకటించారు పోలీసులు. కోపెన్‌హెగన్‌లో నిర్వహించ తలపెట్టిన వీకెండ్ కన్సర్ట్‌ను రద్దు చేశారు. ఇతర షాపింగ్ మాల్స్, పర్యాటక కేంద్రాల వద్ద అనుమానస్పందంగా సంచరిస్తోన్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని ప్రశ్నించిన అనంతరం విడిచిపెట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీస్ చీఫ్ చెప్పారు.

English summary
Three people were killed and several wounded in a shooting at a Copenhagen mall Sunday, Danish police said, adding they had arrested one suspect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X