దాహం.. దాహం.. తాగటానికి నీళ్ళు లేక 49మంది మృతి!

నీరు ప్రాణాధారం. అటువంటి నీరు లేకుండా మనిషి ప్రాణాలే నిలువునా పోతాయి. తాజాగా 49మంది తాగటానికి నీరు లేక ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ప్రతీ ఒక్కరి మనసుకు బాధ కలిగించటమే కాదు నీరు అవసరాన్ని ఆలోచించేలా చేస్తుంది. పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లో అత్యంత ఘోరమైన విషాదం చోటుచేసుకుంది.

నీరు లేక 49మంది మృతి

సహారా ఎడారి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు మధ్యలో పాడైపోవడంతో, అందులోని ప్రయాణికులలో 49మంది తీవ్రమైన ఎండ వేడికి, తాగడానికి చుక్కనీరు దొరక్క ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారకఘటన నైజర్ సరిహద్దుల్లోని నిర్జన ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజర్ దేశానికి చెందిన కొందరు పౌరులు తమ బంధువులతో కలిసి ఒక పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు పొరుగునే ఉన్న మాలి దేశానికి వెళ్లారు.

49 Migrants Die for water In Sahara Desert after their vehicle breakdown in the middle of the desert

సహారా ఎడారిలో ఆగిపోయిన ట్రక్

ఉత్సవాలు ముగించుకుని తిరిగి ట్రక్కులో స్వదేశానికి వస్తుండగా, నైజర్ సరిహద్దు పట్టణమైన అసమాకాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వీరి వాహనం మొరాయించింది. ఆ ప్రాంతం పూర్తిగా జనావాసాలకు దూరంగా, కనుచూపు మేరలో ఎవరూ లేని ఎడారి కావడంతో వారికి ఎలాంటి సహాయం అందలేదు. డ్రైవర్, ప్రయాణికులు ఎంత ప్రయత్నించినా ట్రక్కు బాగుపడలేదు. దీంతో వారంతా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ప్రాణాలతో బయట పడాలని సాహసం చేసిన ఇద్దరు

అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వెంట తెచ్చుకున్న నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో ప్రయాణికులు దాహంతో అల్లాడిపోయారు. ఈ భయంకర పరిస్థితి నుండి ఎలాగైనా బయటపడాలని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి, సుమారు 50 కిలోమీటర్ల దూరం కాలినడకన ఎడారిలో ప్రయాణించి అసమాకా పట్టణానికి చేరుకున్నారు. వారు అక్కడి అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది.

ఐదు రోజులు వర్షాలు.. నేడు ఈ జిల్లాలలోనే..మేఘాల మెసేజ్!
ఐదు రోజులు వర్షాలు.. నేడు ఈ జిల్లాలలోనే..మేఘాల మెసేజ్!

49 మంది విగత జీవులుగా.. విషాదం

అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. నిస్సహాయ స్థితిలో ఎండ దెబ్బకు, డీహైడ్రేషన్‌కు గురై ట్రక్కు చుట్టూ 49 మంది మరణించి పడి ఉన్నారు. సాధారణంగా ఆఫ్రికా నుండి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వెళ్లేవారు మాత్రమే ఇటువంటి ప్రమాదకరమైన ఎడారి మార్గాలను ఎంచుకుంటారని, గతంలోనూ ఇక్కడ ఆకలి, దాహంతో పలువురు మరణించారని స్థానిక యంత్రాంగం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+