మనోళ్లపై ట్రంప్ కు ఇంకా కోపం చల్లారినట్టులేదు

Donald Trump: అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో భారత్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారుల భరతం పడుతున్నారు. అక్రమంగా నివసించే భారతీయులను వెనక్కి పంపించే కార్యక్రమానికి ఇదివరకే తెర తీసిన అమెరికా.. దీన్ని మరింత ముమ్మరం చేసింది. విదేశాంగం- రక్షణ మంత్రత్వ శాఖ సంయుక్తంగా ఈ ఏరివేతను చేపట్టాయి.

గతంలో 205 మంది భారతీయులను సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భారత్ కు పంపించిన విషయం తెలిసిందే. వారందరినీ కూడా చేతులకు బేడీలు వేసి, కాళ్లకు సంకెళ్లతో బంధించి ఏకంగా మిలిటరీ హెలికాప్టర్‌లో స్వదేశానికి పంపించింది. అక్రమ వసలదారులు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేసింది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడంతో పాటు నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికింది.

54 Indian Nationals Sent Back from the US

ఇప్పుడు తాజాగా 54 మంది భారతీయులను స్వదేశానికి పంపించింది. వీరిలో 50 మంది హర్యానాకు చెందినవారే. 'డంకీ రూట్' ద్వారా వాళ్లు అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఈ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 54 మందిలో కర్నాల్‌- 16, కైథల్‌- 15, అంబాలా- 5, యమునానగర్‌- 4, కురుక్షేత్ర-4, జింద్‌-3, సోనిపట్‌- 2 ఉన్నారు. పంచ్ కుల, పానిపట్, రోహ్‌తక్, ఫతేహాబాద్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఎక్కువమంది 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారే.

దీనికి సంబంధించిన వివరాలను కర్నాల్ డీఎస్పీ సందీప్ కుమార్ వెల్లడించారు. డంకీ రూట్ ద్వారా అక్రమంగా వాళ్లు అమెరికాలోకి ప్రవేశించారని, వారి వద్ద ఎటువంటి వాల్యూడ్ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల అమెరికన్ అధికారులు స్వదేశానికి పంపించారని చెప్పారు. కుటుంబాలకు అప్పగించామని, ఇప్పటివరకు ఏ ట్రావెల్ ఏజెంట్‌పైనా ఫిర్యాదు అందలేదని అన్నారు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లకూడదని, భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుందని చెప్పారు.

అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత ఈ డిపోర్ట్ చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాలిఫోర్నియాలో ఓ భారతీయుడు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యాడు. ఎస్‌యూవీని ఢీకొట్టాడు. అది చైన్ రియాక్షన్ కు దారి తీసింది. ఒక దాని వెెనుక మరొక వాహనం ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ కేసులో నిందితుడు 21 ఏళ్ల జస్మన్‌ ప్రీత్ సింగ్ కూడా అక్రమ వలసదారుడే. 2022లో అతను డాంకీ రూట్ గుండా అమెరికాలో ప్రవేశించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+