8 మంది మృతి.. కొనసాగుతోన్న రష్యా దాడి.. ఎదుర్కొంటాం: ఉక్రెయిన్
ఓ వైపు చర్చలు జరుగుతూనే ఉంటోన్న.. మరోవైపు యుద్దం మాత్రం కంటిన్యూ అవుతుంది. అయితే ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థి నవీన్ చనిపోవడం కలకలం రేపింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇటు రష్యా మంగళవారం జరిపిన దాడిలో 8 మంది చనిపోయారని ఉక్రెయిన్ తెలియజేసింది.

మరోవైపు ఈయూలో చేరతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నిన్న ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమ వైపు నిలబడి రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని జెలెన్ స్కీ కోరారు. ఈ మేరకు ఆయన ఈయూతో వీడియో కాల్ మాట్లాడారు. తమ దేశంపై పోరాటం చేస్తున్నామని.. ఇదీ తమ భూమి అని తెలిపారు. తమను ఎవరూ వేరు చేయలేదని.. మరింత బలపడుతామని చెప్పారు. తాము కలిసి పోరాటం చేసి.. చీకటిని పారదోలుతామని చెప్పారు.
రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల సిచుయేషన్ దారుణంగా ఉంది. దీంతో ఉక్రెయిన్‌లో ఉన్న పౌరులను తీసుకొచ్చే ప్రయత్నాలను ఆయా దేశాలు చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో.. పొరుగున ఉన్న రొమోనియా.. ఇతర దేశాల గుండా జనం స్వదేశం చేరుకుంటున్నారు. ఇండియా కూడా ఆపరేషన్ గంగా చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశం తీసుకొస్తోంది. అయితే ఇవాళ నవీన్ అనే భారతీయుడు మరణంతో ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఉన్న మిగతా వారిని యుద్దప్రాతిపదికన తీసుకురావాలని భారత్ అనుకుంటుంది. మరో 3 రోజుల్లో 2 విమానాల ద్వారా అందరినీ తరలిస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications