Viral Video: విమానంలో ఇదేం పని.. వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బాబీ కటారియాకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో అతను చేసిన పనికి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయ్యింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో పాతదని ధృవీకరించింది.ఆ సమయంలో బాబీపై తగిన చర్యలు తీసుకున్నట్లు ANI నివేదించింది.

స్పైస్‌జెట్ విమానంలో
ఇలాంటి ప్రమాదాన్ని సహించేది లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. జనవరి 23, 2022న స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించినప్పుడు వీడియో చిత్రీకరించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వెంటనే అతని సోషల్ మీడియా పేజీల నుంచి వీడియో తీసేశారు. "వీడియో అతని FB/Insta పేజీలో అందుబాటులో లేదు.

ధూమపానం
స్పైస్‌జెట్ విమానం టెయిల్ సెక్షన్ వద్ద సోషల్ మీడియా స్టార్ పడుకుని సిగరెట్ తాగుతున్నట్లు వీడియోలో చూపించింది. దేశీయంగా లేదా అంతర్జాతీయంగా అన్ని విమానాల్లో ధూమపానం నిషేధించారు. విమానాల్లో సిగరెట్ తాగితే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయినా అతను సిగరెట్ తాగడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Recommended Video

రోడ్డుపై మందు
బాబీ కటారియా ఇటీవల రద్దీగా ఉండే డెహ్రాడూన్ రహదారిపై మద్యం సేవిస్తున్నట్లు కనిపించే మరో వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఉత్తరాఖండ్ పోలీసు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. జులై 28న హర్యానా నివాసి కటారియా తన ధృవీకరించబడిన ఖాతాకు వీడియోను అప్‌లోడ్ చేయడంతో ఇదంతా ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications