పాకిస్తాన్ నరమేధం- 400 మందికి పైగా మృతి
ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది. అదే సమయంలో అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రం అయ్యాయి.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ ధృవీకరించారు. వందలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్తాన్ చేసిన ఈ దాడులకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక టీవీ ఛానెల్‌లు కూడా ఈ ఫుటేజీని ప్రసారం చేశాయి. హాస్పిటల్, డ్రగ్స్ రిహాబిలిటేషన్ పై దాడి జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా వెల్లడించింది. దాడి సంభవించిన వెంటనే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడం, శిథిలాల నుండి బాధితులను రెస్క్యూ సిబ్బంది తరలించడం ఈ వీడియోల్లో రికార్డయింది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమ్దుల్లా ఫిట్రాత్ చెప్పారు. 2,000 పడకల ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. ఈ ఘటనలో 400 మంది మరణించగా, దాదాపు 250 మందికి పైగా రోగులు గాయపడినట్లు చెప్పారు.
BREAKING: More videos from tonight's Pakistani airstrikes which hit a drug rehabilitation hospital in Kabul, killing or wounding an unspecified number of people, according to an Afghan Taliban spokesperson.
— Yalda Hakim (@SkyYaldaHakim) March 16, 2026
Pakistan’s government rejects this, claiming they targeted "military… pic.twitter.com/GtRmnicTLW
దీన్ని పాకిస్థాన్‌ను తోసిపుచ్చింది. ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్థాన్ చెబుతోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార ప్రతినిధి మొషర్రఫ్ జైదీ స్పందించారు. నిరాధారమైన ఆరోపణలుగా అభివర్ణించారు. పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దాడులు అత్యంత ఖచ్చితమైనవని, సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యమని స్పష్టం చేసింది. పౌర ప్రాంతాలపై ఎటువంటి దాడులు జరగలేదని వివరించింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications