గాల్లోకి ఎగిరిన యూఎస్ విమానం: ఆప్ఘాన్ మహిళకు నొప్పులు, పైలట్ అప్రమత్తతో సేఫ్
కాబూల్: తాలిబన్ల అరాచకాల భయంతో ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోతున్న విషయం తెలిసిందే. బతికుంటే చాలనుకుని అక్కడే ఆస్తులన్నింటినీ వదిలేసుకుని విదేశాలకు బయల్దేరుతున్నారు. కాబూల్ విమానాశ్రయం ఆవరణలో ఆప్ఘాన్ ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. హదయాలను కలచివేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కాగా, శనివారం ఆప్ధాన్‌కు చెందిన ఓ నిండు గర్భణీ.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానం ఎక్కారు. జర్మనీలోని అమెరికాకు చెందిన రాంస్టెయిన్ బేస్‌కు బయల్దేరింది. అయితే, ప్రయాణ క్రమంలో భూమి నుంచి 8500 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో విమానంలో లో-ఎయిర్ ప్రెషర్ ఏర్పడింది. దీంతో ఆ నిండు గర్భిణీకి నొప్పులు మొదలయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే విమానాన్ని తక్కువ ఎత్తుకు తీసుకొచ్చారు.

విమానంలో లోపల వాయు పీడనాన్ని పెంచి.. ఆ గర్భిణీ ప్రాణాలను కాపాడారు. బేస్‌లో ల్యాండ్ అయ్యాక వైద్య సిబ్బంది హుటాహుటిన ఆమె వద్దకు చేరుకున్నారు. విమానంలోనే ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ శిశివుకు జన్మనిచ్చారు. అనంతరం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Medical support personnel from the 86th Medical Group help an Afghan mother and family off a U.S. Air Force C-17, call sign Reach 828, moments after she delivered a child aboard the aircraft upon landing at Ramstein Air Base, Germany, Aug. 21. (cont..) pic.twitter.com/wqR9dFlW1o
— Air Mobility Command (@AirMobilityCmd) August 21, 2021
ఈ విషయాన్ని అమెరికా ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికారులు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తల్లీ బిడ్డ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ సదరు పైలట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు, ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్ల మాటలకు వారి చేతలకు అసలు పొంతనే లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... ఎవరినీ శత్రువుల్లా భావించమని,కక్ష సాధింపు చర్యలు ఉండవని తాలిబన్లు శాంతి వచనాలు వల్లించారు. కానీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేక అక్కడి ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. అమెరికా మాజీ కాంగ్రెస్ నేత మార్క్ వాకర్ తాజాగా అమెరికన్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ల అరాచకాల గురించి వెల్లడించారు.
ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అత్యంత దారుణంగా ఉన్నాయని మార్క్ వాకర్ పేర్కొన్నారు.'ఆఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న దారుణాల గురించి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఓ క్రిస్టియన్ వ్యక్తిని తాలిబన్లు చిత్రహింసలకు గురిచేసినట్లు చెబుతున్నారు. అతని చర్మం ఒలిచి స్తంభానికి వేలాడదీశారని అంటున్నారు.' అని మార్క్ వాకర్ పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యుల ముందే తాలిబన్లు ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పారు.మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసిందన్నారు.
తాలిబన్ల పాలనలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని... మిలటరీతోనూ తమకెలాంటి శత్రుత్వం లేదని ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. కానీ సైనికులను పట్టుకునేందుకు ఇంటింటికీ తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆడపిల్లల కుటుంబాలను వేధింపులకు,హింసకు గురిచేస్తున్నారు. వారి కూతుళ్లను తమతో పంపించాలని... తమకిచ్చి పెళ్లిళ్లు చేయాలని తాలిబన్లు ఆ కుటుంబాలను వేధిస్తున్నారు. కొన్నిచోట్ల యువతులను చెక్క పెట్టెల్లో నిర్బంధించి సెక్స్ బానిసలుగా ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
మహిళా జర్నలిస్టులను ఇప్పటికే ఆయా మీడియా సంస్థలు ఇంటికి పంపించేశాయి. తాలిబన్ల పాలనలో మహిళల రాజకీయానికి తావు లేదని ఇటీవల వెలుగుచూసిన ఓ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి అర్థమైంది. స్వేచ్చ,హక్కులు మృగ్యమైన చోట ప్రస్తుతం తాలిబన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణాన ఏ తాలిబన్ తుపాకీ తమను ఎక్కుపెడుతుందో తెలియని ఆందోళనలో బతుకుతున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నా... ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి వారిని తరలించడం అసాధ్యంగా కనిపిస్తోంది. భారత్,అమెరికాకు చెందిన వందలాది మంది కాబూల్‌లోనే చిక్కుకుపోయి ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కాబూల్ విమానాశ్రయం వద్ద 20 మంది మృతి
Recommended Video
తాలిబన్ల ఆధీనంలోకి ఆప్ఘానిస్థాన్ వెళ్లిన నాటి నుంచి కాబూల్ విమానాశ్రయంలో 20 మంది వరకు ప్రజలు మృతి చెందారని నాటో దళాలు పేర్కొన్నాయి. తాజాగా, విమానాశ్రయం ఆవరణలో తాలిబన్లు కాల్పులు జరపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. కాలూబ్ విమానాశ్రయం అమెరికా భద్రతా దళాల ఆధీనంలో ఉండగా.. విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు పెద్ద ఎత్తున మోహరించారు. విమానాశ్రయానికి వచ్చేవారిని తాలిబన్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలువురిని విమానాశ్రయానికి వెళ్లకుండా అడ్డుకుని తిరిగి పంపిస్తున్నారు. చంపుతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే ఆప్ఘాన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications