ఒమిక్రాన్ గుప్పిట్లో అమెరికా.. మూడు రోజుల్లో రెట్టింపు కేసులు.. తొలి మ‌ర‌ణం న‌మోదు

కరోనాతో విలవిలాడిన అగ్రరాజ్యం అమెరికాను ఇప్పుడు ఒమిక్రాన్ యవపాశంలా తగులుకుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అంత అంతకు పెరుగుతోంది. వందల సంఖ్యల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా మరణాలతో అల్లాడుతుంటే .. మరోవైపు ఒమిక్రాన్ తోడైంది. తాజాగా ఒమిక్రాన్ తొలి మరణం నమోదైంది. బూస్టర్ డోసు వేసుకున్నప్పటికీ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతున్నాయని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఒమిక్రాన్ తొలి మరణం

ఒమిక్రాన్ తొలి మరణం

అమెరికా మహమ్మారి ఒమిక్రాన్ గుప్పిట్లోకి వెళ్లింది . ఒమిక్రాన్ వైరస్ సోకి తొలి మరణం సంభవించింది . టెక్సాస్ కు చెందిన 50 ఏళ్ల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకి మృతి చెందాడని అధికారులు దృవీకరించారు. ఇతను గతంలో కూడా కరోనాతో పోరాడి జయించాడు. అయినప్పటికీ కరోనా టీ వేయించుకోలేదు. తాజాగా ఒమిక్రాన్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కొత్త వేరియంట్‌ విజృంభ‌ణ‌

కొత్త వేరియంట్‌ విజృంభ‌ణ‌

అమెరికాలో 20 రోజుల కిందట తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. క్రమక్రమంగా కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపవుతోంది. గత వారంతో పోల్చితే ఈ కొత్త‌ వేరియంట్ల కేసులు సంఖ్య 73 శాతం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ సంఖ్య గతంలో సంభవించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే అత్యధికంగా ఉంది. మూడు రోజుల్లోనే ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రెట్టింపుకు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు.

ఆస్ప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌..

ఆస్ప‌త్రుల్లో బెడ్ల కొర‌త‌..

అగ్రరాజ్యంలో ఒక వైపు కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దాదాపు 48 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రుల్లో బెడ్లు నిండిపోయాయి. మరో వైపు కేసు సంఖ్య పెరుగడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా డెల్టా వేరయంట్ కంటే ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు వాపోతున్నారు.

భయాందోళనలో అమెరికన్లు..

భయాందోళనలో అమెరికన్లు..

గతంలో కరోనా డెల్టా వేరియంట్ తో అమెరికా అతాలాకుతలమైంది. ఈ వైరస్‌తో లక్ష‌లాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. చాలా ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. మరణాలు ఎక్కువై, స్మశానాలు కూడా ఖాళీ లేకపోవడంతో మృత దేహాలను నెలల తరబడి ఫ్రీజర్‌లోనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మరో సారి సంభవిస్తాయా.. అని అమెరికన్లు భయాందోళనకు గురవుతున్నారు.

పొంచి ఉన్న ప్ర‌మాదం

పొంచి ఉన్న ప్ర‌మాదం

నిన్న ఒక్కరోజే అమెరికాలో లక్ష‌న్నార కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ కేసులే అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఈ కొత్త వేరియంట్ వైరస్ పోను పోనూ ఇంకెతమందికి సోకుందో అని అమెరిక‌న్లు భయాందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో కోట్ల సంఖ్యలో కేసులు నమోదు అయ్యే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అత్యధికంగా న్యూయార్క్ లోనే 21 వేలకు పైగా కేసులు నమోదు అవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

బ్రిట‌న్‌లో 37 వేల ఒమిక్రాన్ కేసులు

బ్రిట‌న్‌లో 37 వేల ఒమిక్రాన్ కేసులు

అటు బ్రిటన్ లో కూడా ఒమిక్రాన్ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ కొత్తవేరియంట్ తో ఇప్పటివరకు ఆ దేశంలో 12 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు బ్రిటన్ లో 37 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోజుకూ 10వేల కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు సంఖ్య 82 వేల పైగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+