Earthquake: అమెరికాలో భూకంపం.. హడలిపోయిన ప్రజలు..!
అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఒరెగాన్ రాష్ట్రంలోని బాండన్‌కు పశ్చిమాన 279 కిలోమీటర్ల దూరంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) పేర్కొంది. బుదవారం మధ్యాహ్నం 1:15 గంటలకు సంభవించింది. 10.0 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఒరెగాన్ తీరంలో 43.544 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 127.799 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు.బాండన్ నగరానికి 173 మైళ్ల (279 కిలోమీటర్లు) దూరంలో పసిఫిక్ మహాసముద్రం దిగువన ఉన్న ఫాల్ట్‌లైన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. సాధారణం కంటే ఎక్కువ భూకంపాలు (ఆఫ్టర్‌షాక్‌లు అని పిలుస్తారు) మెయిన్‌షాక్‌కు సమీపంలో సంభవిస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపం విషయం తెలుసుకున్న భారతీయులు అక్కడున్న తమ వారికి ఫోన్ చేసి క్షేమసమాచారం తెలుసుకుంటున్నారు. ఒరెగాన్ లో ఉన్న తెలుగు వారికి రాష్ట్రం నుంచి పలువురు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

అక్టోబర్ 29న బంగాళాఖాతంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉదయం 09.22 గంటలకు 16.1 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. అక్టోబర్ 22న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉదయం 06.52 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు అక్టోబర్ 13న జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూకంపం వచ్చింది. మరుసటి రోజు అస్సాంలోని ఉదల్‌గురిలో భూమి కంపించింది. అక్టోబర్ 13 ఉదయం 6.14 గంటలకు జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని దోడాలోని చీనాబ్ లోయలో 4.3 భూకంపం వచ్చింది.












Click it and Unblock the Notifications