అమెరికాలో ఆంధ్ర యువకుడి హత్య: నల్లజాతీయుల పని
ఇలినాస్: అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వాసి మాదాల రాజేష్ దారుణహత్యకు గురయ్యాడు. డబ్బు కోసమే రాజేష్‌ను నల్లజాతీయులు కాల్చిచంపారని బంధువులకు అతని భార్య నాగమణి సమాచారం అందించారు.
ఇలినాస్ రాష్ట్రంలోని పియోరియా ప్రదేశంలో ఓ గ్యాస్‌కంపెనీలో రాజేష్ ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన రాజేష్ ఎమ్మెస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి అమెరికా వచ్చాడు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు కొంతమంది నల్లజాతీయులు గ్యాస్ కంపెనీ వద్ద వచ్చి డబ్బులు డిమాండ్ చేయగా రాజేష్ అందుకు నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజేష్‌పై నల్లజాతీయులు కాల్పులు జరిపారు.
ఈ విషయాన్ని గ్యాస్ కంపెనీ యజమాని రాజేష్ భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. నల్లజాతీయు కాల్పుల్లో భర్త మృతి చెందడంతో భార్య నాగమణి శోకసంద్రంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications