వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్‌కు నోబెల్ పురస్కారం

|
Google Oneindia TeluguNews

ఓస్లో: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటించారు. 2015 సంవత్సరానికిగానూ అమెరికా ఆర్థికవేత్త ఆంగస్ డేటన్‌ను నోబెల్ పురస్కారం వరించింది. వినియోగం, పేదరికం, సంక్షేమం అంశాలపై చేసిన అధ్యయనానికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

స్థూల అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం విభాగాల రూపాంతరానికి ఆయన చేసిన కృషి ఎంతగానో సహాయ పడింది. లండన్‌లో జన్మించిన డేటన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఈయన చాలా పుస్తకాలు కూడా రాశారు.

Angus Deaton wins Nobel prize in economics

కాగా, డేటన్ ఆర్థికశాస్త్రంలో 2013లో ‘ద గ్రేట్ ఎస్కేప్', 1980లో ‘ఎకనామిక్స్ అండ్ కంజూమర్ బిహేవియర్' అనే పుస్తకాలను రాశారు.

ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి పతకంతోపాటు 8మిలియన్ల స్వీడిష్ క్రోణా(630000 పౌండ్లు) కూడా అందజేయడం జరుగుతుంది.

ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ ఆర్థికశాస్త్రంలో ఈ బహుమతిని ఇవ్వడం 1968లో ప్రారంభించింది. మిగితా ఐదు బహుమతులు 1895లోనే ఏర్పాటు చేయబడ్డాయి.

English summary
Angus Deaton is the 2015 winner of the Nobel prize in economics. The Scottish-born economist is best known for his work on health, wellbeing, and economic development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X