ఈ మ‌సాల బ్రాండ్‌ల‌పై నిషేదం విధించిన మ‌రో దేశం...!

భార‌త‌దేశంలో అనేక ర‌కాల వంట‌కాలు ఎంతో ప్ర‌సిద్ధిచెందాయి. ఇక్క‌డి వివిధ రాష్ట్రాల్లో వివిధ ర‌కాల వంట‌కాలు ఉంటాయి. అలాగే, ఈ వంట‌కాల్లో వాడే మ‌సాల దినుసులు, బ్రాండ్‌లు కూడా వేరే. భార‌త్‌లోని వంట‌కాల‌ల్లో ఎక్కువ‌గా ఘాటైన ప‌దార్థాలను వాడ‌తారు. ఇంకా మ‌సాల పౌడ‌ర్లు కూడా అధికంగా వాడుతుంటారు. అయితే, భార‌త‌దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై తాజాగా మరో దేశం నిషేదం విధించింది. ఈ మ‌సాల బ్రాండ్‌ల‌పై ఇప్ప‌టికే ప‌లు దేశాలు నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మ‌రో దేశం చేరింది. ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పధార్థాలున్నాయనే కారణంతో హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్ దేశాలు ఇప్ప‌టికే వీటిపై నిషేదం విధించాయి. ఇప్ప‌డు నేపాల్ కూడా ఈ మ‌సాల బ్రాండ్‌ల‌పై నిషేదం విధించింది.

ఈ మసాలా దినుసుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు వార్తలు రావడంతో నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మసాల బ్రాండ్‌ల‌ దిగుమతులతో పాటు విక్రయాలు కూడా ఆపివేస్తున్న‌ట్లు నేపాల్ ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇప్ప‌టికీ తాము ఈ రెండు కంపెనీల మసాలాలను ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మ‌సాల దినుసుల‌పై తుది నివేదిక వచ్చే వరకు వీటిని ఇక్క‌డ నిషేదిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ఈ దేశంతోపాటు సింగపూర్ కూడా ఎవరెస్ట్ మిక్స్ ను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఇంకా న్యూజిలాండ్, యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆ రెండు మ‌సాల బ్రాండ్ లకు సంబంధించిన సమస్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.

Another country that has banned these spice brands

నివేదిక వ‌చ్చే వ‌ర‌కు నిషేదం...

బ్రిటన్ ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై మే 16వ తేదీన నిషేదం విధించింది. ఈ మ‌సాల బ్రాండ్‌ల‌లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో వీటిపి దర్యాప్తు జరుగుతోందని, పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు ఈ దినుసుల‌పై నిషేదం కొనసాగుతుందని తెలిపింది. హాంకాంగ్ కూడా MDH, ఎవరెస్ట్ మ‌సాల బ్రాండ్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ రెండు కంపెనీల ద్వారా వచ్చిన మూడు మసాలా మిశ్రమాల విక్ర‌యాల‌ను కూడా ఆపివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+