69వ ఆవిర్భావ దినం: అందరికీ భిన్నంగా ఉ.కొరియా మరో క్షిపణి ప్రయోగం?
శనివారం (సెప్టెంబర్ 9)న 69వ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియాను (డిఆర్ఎన్‌కె) నెలకొల్పారు. దీనిని నెలకొల్పింది ప్రస్తుత అధినేత కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్.
సియోల్: శనివారం (సెప్టెంబర్ 9)న 69వ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నార్త్ కొరియాను (డిఆర్ఎన్‌కె) నెలకొల్పారు. దీనిని నెలకొల్పింది ప్రస్తుత అధినేత కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్. ఆయన సెప్టెంబర్ 9, 1948లో నెలకొల్పి, అధ్యక్షుడు అయ్యారు.
చదవండి: ఉత్తర కొరియా ఎపెక్ట్: చైనా సైంటిస్ట్‌ల పరిశోధనలో షాకింగ్, కిమ్‌కు చెక్

మరో క్షిపణి ప్రయోగించవచ్చునని
డిఆర్ఎన్‌కె నెలకొల్పి శనివారానికి 69 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా రేపు కిమ్ జాంగ్ ఉన్ మరో క్షిపణి పరీక్షను నిర్వహించి, ఆ విధంగా తనదైన శైలిలో సంబరాలు చేసుకుంటాడని ఆ దేశ సరిహద్దును పంచుకుంటున్న దేశాలు భావిస్తున్నాయి.

ఉత్తర కొరియా ప్రకటన
ఇటీవల తాము నిర్వహించిన హైడ్రోజన్ బాంబుపై ఉత్తర కొరియా స్పందిస్తూ.. ఈ వారాంతంలో మరో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఉత్తర కొరియా అధ్యక్షుడి అనుమానం
ఇటీవలే దక్షిణ కొరియా ప్రధాని లీ నాక్ యోన్ ఉత్తర కొరియా చర్యలపై స్పందించారు. ఉ కొరియా ఈ నెల 9న మరో బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం చేసే అవకాశముందని ప్రకటించారు. ఈ విషయంపై దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని చర్చలు జరిపింది.

శనివారం నేషనల్ హాలీడే
శనివారం ఉత్తర కొరియాలో నేషనల్ హాలీడే ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే రేపు తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఉత్తర కొరియా భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లుగా భావిస్తున్నారు.

అందరికీ భిన్నంగా ఉత్తర కొరియా
ఇతర దేశాలు వ్యవస్థాపక లేదా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలంటే పరేడ్‌లు నిర్వహించడం, సంబరాలు చేసుకోవడం చేస్తుంది. ఉత్తర కొరియా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. తన సైనిక సామర్థ్యాన్ని అందరికీ చూపించేందుకు ప్రయత్నిస్తోందని కొందరు భావిస్తున్నారు.

ఖండాంతర క్షిపణి ప్రయోగం
గత ఏడాది సెప్టెంబరు 9న ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించడంతో మళ్లీ అదే జరుగుతుందేమోనని పొరుగుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఆరోసారి అణుపరీక్ష జరపడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసిన ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేపట్టడం ఖాయమంటున్నారు. అది ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications