వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: పాకిస్థాన్‍లో హిందువులపై ఆగని దాడులు..

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీలపై అణచివేత ఆగడం లేదు. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు అంటే దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మల్కండ్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్థాన్‌కు పునాది వేసిన మహమ్మద్ అలీ జిన్నా అన్ని మతాలకు సమాన హక్కులు కల్పించే లౌకిక దేశంగా పాకిస్థాన్ ను తీర్చిదిద్దాలని కలలు కన్నారు.

మహమ్మద్ అలీ జిన్నా

మహమ్మద్ అలీ జిన్నా

ఆగష్టు 11, 1947న పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అతని మొదటి అధ్యక్ష ప్రసంగం చేస్తూ "మీరు స్వేచ్ఛగా ఉన్నారు, మీరు మీ దేవాలయాలకు వెళ్లవచ్చు, మీ మసీదులకు వెళ్లొచ్చు. పాకిస్తాన్ లోని మరే ఇతర ప్రదేశానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి అందరికి స్వేచ్ఛ ఉంది. మీరు ఏ మతానికి లేదా కులానికి లేదా మతానికి చెందిన వారైనా కావచ్చు, దానికి దేశంతో సంబంధం లేదు" అని చెప్పారు.

శ్రీ కృష్ణ దేవాలయం

శ్రీ కృష్ణ దేవాలయం

మహమ్మద్ అలీ జిన్నా కన్న కలలు చెదిరిపోతున్నాయి. పాక్ లో హిందూ మైనారిటీలు, వారి దేవాలయాలపై జరుగుతున్న నిరంతర దాడులతో పాకిస్థాన్ గౌరవం మసకబారుతోంది. అక్కడ హిందువులు మనగ సాగించడం కష్టంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం 2018లో దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని శ్రీ కృష్ణ దేవాలయం కోసం భూమిని కేటాయించింది. అయితే ముస్లిం నిరసనకారులు వెంటనే ప్లాట్‌లో క్యాంప్ చేసి హిందూ ఆలయ నిర్మాణానికి అంగీకరించడానికి నిరాకరించారు.

దాడి

దాడి

ఇస్లామాబాద్‌లో మొదటి హిందూ దేవాలయం నిర్మాణాన్ని అక్కడి ముస్లింలలో కొంత మంది అడ్డుకున్నారు.
ఇటీవల ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని మలాకండ్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు హిందువులను కొట్టారు కూడా. భయంతో 4 హిందూ కుటుంబాలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాడికల్ ఇస్లామిక్ పార్టీ

పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాలపై దాడులు, విధ్వంసం కొత్త విషయం కాదు. ఇక్కడ హిందూ దేవాలయాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం, డిసెంబర్ 31, 2020న, రాడికల్ ఇస్లామిక్ పార్టీ నేతృత్వంలోని ఒక గ్రూప్ కరక్‌లోని తేరి ఆలయాన్ని ధ్వంసం చేసి, తగలబెట్టింది. దీనికి నిరసనగా హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, పాకిస్తాన్‌లో హిందువుల జనాభా 75 లక్షలుగా ఉంది.

English summary
The oppression of Hindu minorities in Pakistan does not stop. Protesters are targeting places of worship ie temples. Malkand temple in Khyber Pakhtunkhwa was destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X