వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకాక్‌ పేలుళ్ల నిందితుడు ఢిల్లీలో గడిపాడు

|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో బ్రహ్మ ఆలయం బయట గతనెలలో సంభవించిన పేలుళ్లకు బాధ్యుడిగా అనుమానిస్తున్న చైనా వ్యక్తి అబుదుసతేర్‌ అబుదురెహ్మాన్‌ అలియాస్‌ ఇషాన్‌(27)ఆగస్టులో కొన్ని గంటలపాటు ఢిల్లీలో ఉన్నట్లు వెల్లడైంది.

పేలుళ్లకు ఒక రోజు ముందుగా(ఆగస్టు 16న) థాయిలాండ్‌ నుంచి బయలుదేరి చైనా వెళ్లి... అక్కడి నుంచి ఇషాన్‌ బంగ్లాకు వెళ్లినట్లు తెలిసింది.

అదే నెల 30న ఢాకా నుంచి అబుదాబీకి బయలుదేరిన ఇషాన్‌.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం మారడం కోసం కొన్ని గంటలు వేచి ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం.కాగా, బ్రహ్మదేవాలయం వద్ద జరిగిన పేలుళ్లలో 20 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.

Bangkok Shrine bombing suspect was at Delhi IGI airport for few hours

పేలుళ్ల కేసులో ఆరుగురి అరెస్ట్

బ్యాంకాక్ హిందూ దేవాలయంపై జరిగిన బాంబు దాడి కేసులో ఒక పాకిస్థానీయుడు, ముగ్గురు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను మలేషియా, థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక పాకిస్థానీయుడు, ఇద్దరు మలేషియన్లను కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశామని మలేషియా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఖాలిద్ అబుబాకర్ సోమవారం మీడియాకు చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో థాయిలాండ్‌కు సహకరిస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వారిని థాయిలాండ్ పోలీసులకు అప్పగించేదేమీ లేదని అబుబాకర్ తెలిపారు. మరోవైపు థాయిలాండ్‌లోని డిన్‌డైంగ్ జిల్లాలో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బ్యాంకాక్ మెట్రోపాలిటన్ పోలీస్ బ్యూరో చీఫ్ శ్రీవారా రంగీసిప్రమానకుల్ వెల్లడించారు.

English summary
The 27-year-old accused from China's Xinjiang province took the flight from New Delhi and left for Abu Dhabi on August 30, the sources said, adding from there he travelled to Istanbul on the next day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X