ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే Bangladesh ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ఎనర్జీ సేవింగ్ చర్యలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను రోజూ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

షాపింగ్ మాల్స్, ఆఫీసులకు పరిమిత సమయాలు..

అలానే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కార్యాలయాల పని గంటలను కూడా తగ్గించింది. ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఆఫీసులు ఇకపై 4 గంటలకే మూతపడతాయి. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా మార్పులు చేశారు. బ్యాంకింగ్ లావాదేవీలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అనుమతించబడతాయి. బ్యాంకులు సాయంత్రం 4 గంటలకే మూతపడేలా నిర్ణయించారు.

bangladesh-government-decision-about-new-timings-for-offices-and-shopping-malls-shops

అత్యవసర సేవలకు మినహాయింపులు..

అయితే, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. హోటళ్లు, ఫార్మసీలు, ఆసుపత్రులు, అత్యవసర సేవలు, అలాగే నిత్యావసర వస్తువుల మార్కెట్లు ఈ ఆంక్షలకు లోబడి ఉండవు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఈ కీలక నిర్ణయాలు Tarique Rahman నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు సమాచారం. దేశ ఆర్థిక పరిస్థితి, ఇంధన నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఈ చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.

భారత్ సహాయం...

మరోవైపు ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు India ఇప్పటికే Bangladeshకు 5,000 టన్నుల డీజిల్‌ను సరఫరా చేసింది. ఈ సహాయం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ మరింత సహాయం కోరింది. రాబోయే నాలుగు నెలల్లో అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేయాలని బంగ్లాదేశ్ భారత్‌ను అభ్యర్థించింది. ఈ అభ్యర్థనపై భారత ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి Randhir Jaiswal, బంగ్లాదేశ్ విన్నపాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే, ఇంధన అవసరాల కోసం బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా Sri Lanka, Maldives వంటి ఇతర పొరుగు దేశాలు కూడా భారత్‌ను ఆశ్రయిస్తున్నాయని పేర్కొన్నారు. మరి ఈ కొత్త నిబంధనలతో ప్రజల దైనందిన జీవనశైలిలో మార్పులు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే దీర్ఘకాలంలో ఇంధన ఆదా చర్యలు దేశ ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+