వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణుబాంబు దాడి, క్షమాపణ చెప్పను: బరాక్ ఒబామా

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ లోని హిరోషిమాలో అమెరికా జరిపిన అణుదాడిపై తాను క్షమాపణ చెప్పనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఈ వారంలో జపాన్ పర్యటన సందర్బంగా ఒబామా హిరోషిమాను సందర్శించనున్నారు. హిరోషిమాలో చేయబోయే వ్యాఖ్యల్లో క్షమాపణ కూడా ఉంటుందా ? అంటూ జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్ హెచ్ కే ఒబామాను అడిగింది.

క్షమాపణ అనే విషయం చెప్పనని, యుద్ధ సమాయాల్లో దేశాధినేతలు అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారని మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కోన్నారు. ఆ నిర్ణయాలను పరశీలించి ప్రశ్నలు అడిగితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Barack Obaama will not apologize for Hiroshima attack

యుద్ధ సమయాల్లో కష్టమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఒబామా అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ లోని హిరోషిమా పై 1945 ఆగస్టు 6వ తేదిన అమెరికా అణుబాంబు దాడి జరిపి 71 ఏళ్లు అవుతుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు హిరోషిమాలో పర్యటించనున్నారు.

హిరోషిమాను సందర్శిస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కావడం విశేషం. ఇదే స సందర్బంలో జపాన్ ప్రభుత్వ మీడియా ఈ పర్యటన మీదఎక్కవ ఆసక్తి చూపిస్తున్నది. హిరోషిమాలో జరిగిన అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన బాధితులు ఒబామా నుంచి ప్రశ్చాత్తపం ఆశిస్తున్నారని జపాన్ మీడియా తెలిపింది.

English summary
Obama will become the first sitting US president to tour the site of the world’s first nuclear bombing this Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X