వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ తేనేటీగ వల్ల విమానం పైకి ఎగరలేదు!

|
Google Oneindia TeluguNews

జకార్తా: ఓ తేనెటీగ విమానంలోని ఇంజిన్‌లో దూరడంతో ఆ విమానాన్ని నిలిపివేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గరుఢ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్‌ 737 మంగళవారం సుమత్రా నుంచి జకార్తా వెళ్లాల్సి ఉంది.

మరికొద్ది సేపట్లో విమానం బయలుదేరాల్సి ఉండగా ఇంజిన్‌ స్టార్ట్‌ కాలేదు. వెంటనే పైలట్‌ అధికారులకు సమాచారం అందించడంతో వారు పరిశీలించగా ఇంజిన్‌లోని ఓ ట్యూబ్‌లో తేనెటీగ దూరినట్లు తెలిసింది.

Bee on a plane causes flight delay

దాదాపు నాలుగు గంటల పాటు కష్టపడి ఆ తేనేటీగను బయటకు పంపించి విమానాన్ని మళ్లీ ప్రయాణానికి సిద్ధం చేశారు. కాగా, జరిగిన ఆలస్యానికి విమానంలోని 156 మంది ప్రయాణికులకు కొంత డబ్బు పరిహారం కింద చెల్లించినట్లు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇటీవల బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ అవుతుండగా ఓ తేనేటీగా విమానం ఇంజిన్‌లో దూరంతో సమస్య ఏర్పడింది. దీంతో విమానం టేకాఫ్ కొంత ఆలస్యమైంది.

English summary
A bee delayed an Indonesian passenger plane for 4 hours after getting stuck in vital equipment and causing a problem with the aircraft’s controls, the airline said Wednesday, January 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X