భౌతిక శాస్త్ర నోబెల్‌ పురస్కారం ప్రకటన- బ్లాక్‌హోల్‌ పరిశోధనలకు ముగ్గురికి సంయుక్తంగా

ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. నిన్న వైద్యశాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ప్రకటించగా.. ఇవాళ భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. ఈసారి కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అవార్డు గెల్చుకున్నారు. స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో విజేతల పేర్లను సెలక్షన్‌ జ్యూరీ ప్రకటించింది.

ఖగోళంలోని పాలపుంతలపై జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా బ్లాక్‌ హోల్స్‌, అవి ఏర్పడిన విధానం వంటి అంశాలపై చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ భౌతిక శాస్త్ర పురస్కారం లభించింది. ఇందులో రోజర్‌ పెన్‌రోజ్‌, రీన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా ఘెజ్‌ ఉన్నారు. వీరు ముగ్గరూ విజేతలకు లభించే 10 మిలియన్‌ క్రోనార్ల బహుమతిని పంచుకుంటారు. అంతరిక్షంలో ఎంతో విలువైన వస్తువులకు సంబంధించి జరిగిన పరిశోదనలకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించడం సంతోషంగా ఉందని ఫిజిక్స్‌ కమిటీ హెడ్‌ డేవిడ్‌ హేవీలాండ్‌ తెలిపారు.

Black hole breakthroughs win Nobel physics prize

బ్రిటన్‌ శాస్త్రవేత్త రోజర్‌ పెన్‌రోజ్‌ ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాధారణ సంభావ్యత సిద్ధాంతంలో బ్లాక్‌హోల్స్‌ కూడా భాగమని నిరూపించారు. అమెరికాకు చెందిన మరో ఇద్దరు శాస్త్రవేత్తలు రీన్‌హార్డ్‌ గెంజెల్‌, ఆండ్రియా ఘెజ్‌.. సూపర్‌ మాసివ్‌ బ్లాక్‌ హోల్ పాలపుంత కేంద్రంలో ఉందనే అంశాన్ని కనిపెట్టారు. వీరు తమ ఆవిష్కరణలతో సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితులు ఉన్నాయని, భూవాతావరణాన్ని అధిగమించేందుకు కొత్త పద్ధతులు అవసరమని నిరూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+