ఐదో రౌండ్‌లోనూ విజయం.. బ్రిటన్ ప్రధాని పదవీకి అడుగుదూరంలో రిషి సునక్
బ్రిటన్ ప్రధాని పదవీకి భారత సంతతికి చెందిన రిషి సునాక్ అడుగుదూరంలో నిలిచారు. ఇవాళ ఐదో రౌండ్‌లో కూడా విజయం సాధించారు. బోరిస్ జాన్సన్ ప్రధాని పదవీకి రాజీనామా చేయడంతో.. వారసుడిని ఎన్నుకునే ప్రక్రియను అధికార కన్జర్వేటివ్ పార్టీ మొదలుపెట్టింది. పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 4 రౌండ్లు పూర్తి కాగా... బుధవారం ఐదో రౌండ్ ఎన్నికలు ముగిశాయి.

ఐదో రౌండ్‌లో విజయం
ఐదో రౌండ్ ఎన్నికల్లో రిషి సునాక్ అధిక ఓట్లు సాధించి, తొలి స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్ ఓటింగ్‌లో సునాక్‌కు 137 ఓట్లు వచ్చాయి. సునాక్ తర్వాతి స్థానంలో లిజ్ ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే లభించాయి. ప్రధాని పదవీ రేసులో మరో అడుగు ముందుకేసినట్టు అయ్యింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కూతురు అక్షతను సునాక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ నేపథ్యం..
రిషి సునక్ తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టిషనర్, తల్లి ఫార్మాసిస్ట్. రిషి సునక్ ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ వర్సిటీల్లో డిగ్రీ పూర్తిచేశారు. నారాయణ మూర్తి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2015లోనే అతను ఎంపీగా ఎన్నికయ్యాడు. రిచ్ మండ్, యార్క్ షైర్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. 2020లో జీవితంలో మైలురాయిగా నిలిచింది. బ్రిటన్ క్యాబినెట్‌లో కీలకమైన ఆర్థికమంత్రి పదవీ చేపట్టారు.

అయినా ఓకే
రిషి సునక్‌కు ఒక్క అంశం ప్రతికూలత కనిపిస్తోంది. ఇటీవల ఆయన భార్య అక్షత మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఆమె భారత్‌కు చెందిన మహిళ కావడంతో ఆమె నాన్ డొమిసైల్ హోదాలో బ్రిటన్‌లో ఉంటున్నారు. భారత పౌరసత్వం మాత్రమే ఉండడంతో బ్రిటన్‌లో నాన్ డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. నాన్ డొమిసైల్ హోదా ఉన్న వారు విదేశీ గడ్డపై సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అక్షత మూర్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని బ్రిటన్ విపక్షాలు ఆరోపించాయి. అక్షతపై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని రిషి సునక్ వర్గం ఎదురుదాడికి దిగింది. కానీ ఇదీ అంతగా ప్రభావం చూపించలేదు.












Click it and Unblock the Notifications