అమెరికా కాల్పులు: ఆ జంటకు ఐఎస్ఐఎస్‌తో లింక్
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కాల్పులకు పాల్పడిన జంటకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల (ఐఎస్ఐఎస్)తో సంబంధాలున్నాయని అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు.
పాకిస్థాన్ సంతతికి చెందిన సయ్యద్ రిజ్వాన్ ఫరూక్, మాలిక్ జంట కాలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్ బెర్నార్డినో ప్రాంతంలో కాల్పులు జరిపి అనేక మందిని అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని మొదట అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
అనుకున్నట్లే వారికి ఉగ్రవాదులతో లింక్ ఉందని విచారణలో వెలుగు చూసిందని, ఫరూక్ చాల సార్లు సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంభాషణలు, చర్చలు జరిపినట్లు తమ విచారణలో వెలుగు చూసిందని తెలిపారు.

ఫరూక్ దగ్గర వందలాది మందిని అంతం చెయ్యడానికి అవసరమైన అత్యాధునిక మారణాయుధాలు ఉన్నాయని విచారణలో వెలుగు చూసింది. అయితే భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ఫరూక్, మాలిక్ జంట అంతం అయ్యారు.
మొదట ప్రాథమిక విచారణలో వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని తెలిసింది. అయితే లోతుగా దర్యాప్తు చెయ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఎఫ్ బీఐ నిఘా పరిధిలో ఫరూక్ దంపతులు లేరని అధికారులు తెలిపారు.
ఫరూక్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారి మీద నిఘా వెయ్యలేదు. ఫరూక్ దాడులకు పాల్పడ్డాడని తెలుసుకున్న అతని సన్నిహితులు సైతం నమ్మలేక పోతున్నారని దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications