ఐక్యమత్యంతో కూడిన భవిష్యత్తు కోసం:అబుదాబిలోని మందిర్‌లో ఐజీఎఫ్ నేతల సమావేశం..!!

అబుదాబి వేదికగా బాప్స్ హిందూ మందిర్ ‌లో జరిగిన ఇండియా గ్లోబర్ ఫోరం లీడర్స్ డిన్నర్ కార్యక్రమంలో భారత్‌తో పాటు మధ్యప్రాచ్య దేశాలకు చెందిన నాయకులు,నేతలు పాల్గొన్నారు. పలు అంశాల మీద వీరు అర్థవంతమైన చర్చలు జరిపారు. ఆయా దేశాల విభిన్న సంస్కృతులు ఒక్క గొడుగు కిందకు చేరడంతో ఈ మందిరం మతపరమైన సమైక్యతకు చిహ్నంగా నిలిచింది.యూఏఈ-భారత్‌ల మధ్య ఐక్యత, భిన్న సంస్కృతులకు ఈ వేదిక అద్దం పడుతోంది.ఈ ఏడాదే ఈ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యూఏఈలో భారత అంబాసిడర్ సంజయ్ సుధీర్‌తో పాటు బాప్స్ హిందూ మందిర్‌కు చెందిన పూజ్య బ్రహ్మవిహారీ స్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అబుదాబిలోని BAPS హిందూ దేవాలయానికి చెందిన పూజ్య బ్రహ్మవిహారి స్వామి తన ప్రసంగంలో ఆలయ విశిష్టతను వివరించారు. నాయకులకు నేతలకు కూడా మార్గనిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో తాము సాధించిన విజయాలు,విజయవంతమైన వ్యక్తులు తమ మనసు చెప్పే మాటలకు కూడా స్థానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదని చెప్పారు.

Celebrating Harmony and Wellness IGF Leaders Dinner in Abu Dhabi s Iconic Mandir

ఐక్యతకు ప్రతీక ఈ దేవాలయం

యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడారు. యూఏఈలో అత్యధిక మంది సందర్శించే ప్రదేశాలలో ఈ దేవాలయం ఒకటని చెప్పారు. ఇదొక ఆలయం అని చెప్పడం కన్నా ఇదొక సామరస్యానికి చిహ్నం అని చెప్పొచ్చని సంజయ్ సుధీర్ అన్నారు.2015లో పునాది పడ్డ ఈ ఆలయం నాయకత్వంతో కూడిన విజన్‌ను ప్రతిబింబిస్తుందని నాడు ప్రధాని మోదీ చెప్పిన మాటలను గుర్తు చేశారు.2024లో ప్రధాని మోదీనే ఈ ఆలయాన్ని ప్రారంభించారని చెప్పారు.

నమ్మకం అనే మంత్రం రెండు దేశాలను మంచి మిత్రదేశాలుగా మార్చిందని చెప్పారు ఐజీఎఫ్ వ్యవస్థాపకులు, ఛైర్మెన్ మనోజ్ లద్వా.గత పదేళ్లలో భారత్ యూఏఈలు స్నేహబంధం మరింత బలపడి విరాజిల్లిందంటే దానికి కారణం రెండు దేశాల మధ్య ఉన్న నమ్మకం విశ్వాసమే అని నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ, యూఏఈ రాజుల మధ్య మంచి స్నేహం ఉండటంతో యూఏఈ లాంటి దేశంలో మత సామరస్యం వికసిస్తూ ఇక్కడ ఇంత గొప్ప మందిరం నిర్మించేందుకు సాధ్యపడిందన్నారు.

ఆయుర్వేద అనేది ప్రాచీనకాలంలో సేవలాంటిది. ఆధునిక వైద్యం వ్యాధిని ఒక అవయవంగా పరిగణిస్తుంది.మనిషి అవయవం కాదు. శరీరం, మనస్సు ఆత్మ ఈ మూడు కలిపితేనే మనిషి అని చెప్పారు తులా వ్యవస్థాపకులు ఫైసల్ కొట్టికొల్లాన్.మళ్లీ మనం ఆయుర్వేద కాలంనాటికి వెళ్లాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతి,భారతీయుల జీవనశైలిని బాప్స్ మందిరం ద్వారా ప్రతిబింబిస్తోందని సంస్కృతి మరియు నాయకత్వ నిపుణులు సుహేల్ సేథ్ అభిప్రాయపడ్డారు. ఎడారిలో నిజమైన సముద్రం ఇదే అని చెప్పారు.మంచి ఆరోగ్యంతో ఉండటమంటే మంచి ఆత్మతో ఉండటం అని చెప్పిన ఆయన.. మందిరం కూడా మంచి ఆత్మతోనే ముందుకెళుతోందని అన్నారు.మంచి అంటే భగవంతుడని, అది మందిరం అయినా, మసీదైన చర్చి అయినా మంచే అక్కడ కనిపిస్తుందని చెప్పారు. సాటి మనిషి పట్ల మానవత్వం ఉంటే చాలని అదే ఆత్మీయంగా బలపరుస్తుందని చెప్పారు.

"ప్రపంచాన్ని ఐక్యమత్యంతో నడిపించగల సత్తా క్రీడలకుంది. టెన్నిస్ బంతికి భాష అర్థంకాదు.అయితే 1.4 బిలియన్ మంది గర్వపడేలా చేయడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను.క్రీడలు అనే వాహనం ద్వారా 250 మిలియన్ మంది చిన్నారుల్లో స్ఫూర్తి నింపడమే నా కల. తూర్పు దేశాల తత్వశాస్త్రం, మన ప్రాచీన సంస్కృతి అన్నీ శక్తిని విశ్వాసాన్ని బోధిస్తాయి. విజయం సాధించాలంటే ఆయా దేశాలనుంచి వచ్చిన మనమంతా పశ్చిమ ప్రపంచ దేశాలను తూర్పుదేశాల జ్ఞానాన్ని సమత్యులత చేసేలా ఉండాలి"అని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చెప్పారు.

ఇక ఈ కార్యక్రమంలో అర్థవంతమైన చర్చ జరిగింది. భవిష్యత్తులో అంతా జతకట్టడం ద్వారా ఐక్యతతో పాటు అభివృద్ధిని సాధించే దిశగా పయనించాలని చర్చించారు. లిమిట్‌లెస్ హారిజాన్స్ అనే థీమ్‌కింద జరిగిన చర్చలో భాగంగా భారత్,మిడిల్ ఈస్ట్,ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ప్రారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులు, ఇన్వెస్టర్లు అందరూ కలసి ప్రపంచ భాగస్వామ్యం, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వాతావరణం, సుస్థిరతపై కలిసి పనిచేయాలని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చాయి.

ఇండియా గ్లోబల్ ఫోరమ్ సమకాలీన భారతదేశ కథను చెబుతుంది.వేగవంతమైన వృద్ధి,భారత్‌లో చోటు చేసుకున్న మార్పులు ప్రపంచానికి అవకాశాలు కల్పిస్తున్నాయి.ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఒక ప్రధాన ద్వారంగా ఐజీఎఫ్ పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+